Begin typing your search above and press return to search.

ఆ పాన్ ఇండియా స్టార్ తో 43 ఏళ్ల హాట్ బ్యూటీ!

'కేజీఎఫ్' ప్రాంచైజీ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ య‌శ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కోసం ఎంత స‌మ‌యం తీసుకున్నాడో? తెలిసిందే

By:  Tupaki Desk   |   19 March 2024 7:47 AM GMT
ఆ పాన్ ఇండియా స్టార్ తో 43 ఏళ్ల హాట్ బ్యూటీ!
X

'కేజీఎఫ్' ప్రాంచైజీ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ య‌శ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కోసం ఎంత స‌మ‌యం తీసుకున్నాడో? తెలిసిందే. కొన్ని నెల‌లు పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన య‌శ్ చివ‌రికి లేడీ మేక‌ర్ గీతూ మోహ‌న్ దాస్ తో 'టాక్సిక్' అనే ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించాడు. దీంతో ప్రాజెక్ట్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది? ఇక నుంచి అంతా హ‌డావుడిగానే ఉంటుంద‌ని అభిమానులు భావించారు. కానీ మ‌ళ్లీ స‌న్నివేశం ఒక్క‌సారిగా మౌనం అయింది. అనౌన్స్ మెంట్ త‌ర్వాత కూడా రాఖీభాయ్ సైలెంట్ గానే ఉన్నాడు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. స్టోరీ లాక్ అయింది. హీరో లాక్ అయ్యాడు? ఇంకెందుకు ఆల‌స్యమ‌ని ర‌క‌ర‌కాల సందేహాలు...ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని పట్టించుకుంది లేదు. ఇలా కొంత కాలం గ‌డిచింది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే ఓ పాన్ ఇండియా సినిమాతో సౌత్ మార్కెట్ లో లాంచ్ అవుతున్నాను అంటూ క‌రీనా క‌పూర్ ప్ర‌క‌టించింది. దీంతో ఆసినిమా ఏంటి? అని ప్ర‌చారం షురూ అయింది.

'టాక్సిక్' సినిమాకే ఆమెని ఎంపిక చేసార‌ని కొన్ని గెస్సింగ్స్ అయితే తెర‌పైకి వ‌చ్చాయి గానీ క్లారిటీ లేని అంశం కావ‌డంతో న‌మ్మ‌ని వ‌ర్గం అంతే బ‌లంగా ఉంది. అయితే బాలీవుడ్ సినిమా 'ది క్రూ' ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్న క‌రీనా ఓ ఇంట‌ర్వ్యూలో సౌత్ సినిమా షూట్ కి రెడీ అవుతున్నాన‌ని మ‌రోసారి రివీల్ చేసింది. దీంతో అది 'టాక్సిక్' సినిమా అనే విష‌యాన్ని ప‌రోక్షంగా ఇలా రివీల్ చేస్తుందంటూ ప్ర‌చారం వెడెక్కుతోంది.

ఇదే నిజ‌మైతే 38 ఏళ్ల య‌శ్ తో 43 క‌రీనా మ‌ధ్య రొమాన్స్ సంగ‌తేంటి? అన్న‌ది సీరియ‌స్ గా ఆలోచించా ల్సిన విష‌య‌మే. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉంది. 15 సంవ‌త్స‌రాలు గ్యాప్ క‌నిపిస్తుంది. సాధార‌ణంగా హీరో వ‌య‌సు ఎక్కువ‌గా...హీరోయిన్ వ‌య‌సు త‌క్కువ‌గానూ ఉంటుంది. కానీ ఇక్క‌డ సీన్ అందుకు పూర్తి భిన్నంగా ఉంది.