Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్ ఐటెంతో ఆ సినిమా హీట్‌ పెంచారు

ఇక ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్‌ తో చేయిస్తున్న ప్రత్యేక సాంగ్‌ మాస్ ఆడియన్స్‌ లో హీట్‌ పెంచే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2024 5:11 AM GMT
స్టార్‌ హీరోయిన్ ఐటెంతో ఆ సినిమా హీట్‌ పెంచారు
X

అజయ్‌ దేవగన్‌ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్‌ మూవీ సింగం కు సీక్వెల్‌ గా సింగం ఎగైన్‌ అనే సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో ఉండే సర్‌ప్రైజ్ లు మాస్ ఆడియన్స్ కి కచ్చితంగా కిక్‌ ఇచ్చేవి అనడంలో సందేహం లేదు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ మరియు రణవీర్ సింగ్ లు 'సింగం ఎగైన్‌' లో కనిపించబోతున్నారు. వారు గతంలో పోషించిన పాత్రలతోనే ఈ సినిమాలో కనిపించబోతున్న ట్లు సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్‌ తో చేయిస్తున్న ప్రత్యేక సాంగ్‌ మాస్ ఆడియన్స్‌ లో హీట్‌ పెంచే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. నేటి నుంచి ఆ పాటకు సంబంధించిన షూటింగ్‌ ను చేస్తున్నారు. అజయ్‌ దేవగన్ మరియు టైగర్ ష్రాఫ్‌ లు కరీనా తో కలిసి స్టెప్స్ వేస్తున్నారు.

రోహిత్‌ శెట్టి సినిమా అంటే ఫుల్‌ లెంగ్త్‌ మాస్ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ గా ఈ సినిమా రూపొందడటంతో పాటు మల్టీస్టారర్ గా రూపొందుతున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో సింగం ఎగైన్‌ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్‌ గా కనిపించబోతున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.