Begin typing your search above and press return to search.

ఏడుస్తూ నిద్ర లేని రాత్రులు ఎన్నో..!

18 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన కరీనా కపూర్ కెరీర్ కూడా అందరు అనుకున్నట్టుగా అంత ఈజీగా ఏమి సాగలేదు.

By:  Tupaki Desk   |   4 April 2024 2:30 PM GMT
ఏడుస్తూ నిద్ర లేని రాత్రులు ఎన్నో..!
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కరీనా కపూర్ ప్రస్థానం గురించి తెలిసిందే. 18 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన కరీనా కపూర్ కెరీర్ కూడా అందరు అనుకున్నట్టుగా అంత ఈజీగా ఏమి సాగలేదు. తన లైఫ్ లో కూడా సక్సెస్ లు కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ అని.. మొదట్లో తను చేసిన సినిమాలన్నీ ఎందుకు సరిగా ఆడట్లేదో అర్ధమయ్యేది కాదని.. ఆ తర్వాత కథల ఎంపికలో కాస్త మార్పుల వల్ల మళ్లీ ట్రాక్ లోకి వచ్చానని అన్నారు కరీనా కపూర్.


బాలీవుడ్ లో కపూర్ బ్యూటీకి సూపర్ క్రేజ్ ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు తగ్గించిన కరీనా రీసెంట్ గా మళ్లీ నటించడం మొదలు పెట్టింది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో సందడి చేస్తుంది. కరీనా కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ క్రూ రీసెంట్ గా రిలీజైంది. ఈ సినిమాలో టబు, కృతి సనన్ లతో పాటుగా కరీనా కపూర్ కూడా భాగమైంది.

క్రూ సినిమా ప్రమోషన్స్ లో కరీనా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగిన విషయాల గురించి చెప్పుకొచ్చింది. అమ్మ నిర్ణయాలు ఎప్పుడూ కచ్చితంగా ఉండేవి. పిల్లల కోసమే ఆమె ఎప్పుడూ తపిస్తూ ఉండేదని.. ఆ టైం లోనే మహిళ ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పింది. తన జీవితంపై అమ్మ ప్రభావం ఎక్కువే అంటుంది కరీనా. మొదట్లో తన నీలి కళ్ల గురించి అందరు ఏదేదో మాట్లాడుకునే వారు. అలాంటి కళ్లు ఉన్న వారు సినీ పరిశ్రమలో రాణించలేరని అన్నారు. కానీ అమ్మ ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది.

సినిమా సెట్స్ లోనే తన జీవితం గడిచింది అంటున్న కరీనా టీనేజ్ లో ఫ్రెండ్స్ తో పార్టీలు, స్లీప్ ఓవర్స్ చేయాల్సిన టైం లో సినిమాల్లోకి వచ్చి తన కల నిజం చేసుకోవాలని అనుకున్నా. అందుకే సినీ కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేశానని అంటుంది. పాతికేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుకున్నా అని చెప్పిన కరీనా కపూర్ జబ్ వీ మెట్ సినిమా సక్సెస్ తర్వాత తన లైఫ్ మారిపోయిందని అన్నారు. సినిమాలు సరిగా ఆడని టైం లో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను.. ఎన్నో రోజులు ఏడుస్తూ ఉన్నానని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు కరీనా కపూర్. ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్న కరీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ఎలాంటి పాత్రలైనా చేసేందుకు రెడీ అంటుంది కరీనా.