Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : 43 ఏళ్ల వయసులోనూ అదే అందం

బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ కరీనా కపూర్ ఖాన్

By:  Tupaki Desk   |   5 March 2024 9:15 AM GMT
పిక్ టాక్‌ : 43 ఏళ్ల వయసులోనూ అదే అందం
X

బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ కరీనా కపూర్ ఖాన్. ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. వయసు 43 ఏళ్లు... అయినా కూడా ఈమె అందం మూడు పదుల వయసు అందం అన్నట్లుగా ఉందని ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.

రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో సందడి చేసే ముద్దుగుమ్మ కరీనా కపూర్‌ తల్లి అయిన తర్వాత కూడా చాలా అందంగా కనిపిస్తూ బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఒకప్పుడు కరీనా కపూర్‌ ఎంత బిజీగా వరుసగా సినిమాలు చేసేదో ఇప్పటికి అంతగా సినిమాలు చేస్తుంది అంటే కారణం ఆమె అందం అనడంలో సందేహం లేదు.

సాధారణంగా నాలుగు పదుల వయసుకు చేరిన ఆడవారు బరువు పెరగడం లేదా ఇతర కారణాల వల్ల అందం కాస్త తగ్గడం జరుగుతుంది. కానీ కరీనా కపూర్ మాత్రం చాలా అందంగా ఉన్నారని తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫోటోలను బట్టి అర్థం అవుతుంది.

సోషల్‌ మీడియాలో బంగారు వర్ణపు డ్రెస్‌ లో కరీనా కపూర్‌ అందాల షో చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ రేంజ్ లో కొత్త హీరోయిన్స్ కూడా అందంగా కనిపించరేమో అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు ఆమె ఫిజిక్‌ మెయింటనెన్స్ ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.