Begin typing your search above and press return to search.

ఒక ఔట్‌సైడ‌ర్‌ని ఇన్సైడ‌ర్ పొగిడిన వేళ‌

ఈ సమయంలో పరిశ్రమలో మహిళల స్థానాలను మెరుగుపరిచినందుకు దీపికా పదుకొనే, విద్యాబాలన్, కంగనా రనౌత్ వంటి తోటి నటీమణులపై ప్రశంసలు కురిపించింది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 12:30 AM GMT
ఒక ఔట్‌సైడ‌ర్‌ని ఇన్సైడ‌ర్ పొగిడిన వేళ‌
X

బాలీవుడ్‌లో ఇన్ సైడ‌ర్, ఔట్ సైడ‌ర్ టాపిక్ ఎప్ప‌టికి ఎండ్ కానిది. దీనికి అంతూ ద‌రీ లేదు. ఔట్ సైడ‌ర్ గా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి ఇక్క‌డ శాసించే స్థాయికి ఎదిగిన అరుదైన క‌థానాయిక‌గా క్వీన్ కంగ‌న ర‌నౌత్ కి గుర్తింపు ఉంది. కంగ‌న బాలీవుడ్‌లో బంధుప్రీతిని చాలాసార్లు విమ‌ర్శించారు. ముఖ్యంగా క‌పూర్ గాళ్స్ ని నిరంతరం ఏదో ఒక వంక‌తో విమ‌ర్శిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడే అవేవీ మ‌న‌సులో పెట్టుకోకుండా ది గ్రేట్ క‌పూర్ హీరోయిన్ కరీనా కపూర్ నేరుగా క్వీన్ కంగ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించింది.

కరీనా కపూర్ ఖాన్ న‌టించిన 'క్రూ' విడుద‌ల‌కు వ‌స్తున్న వేళ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మాట్లాడుతూ.. చాలా మహిళా-కేంద్రీకృత చిత్రాలు రూపొందుతున్న ఈ సమయంలో పరిశ్రమలో మహిళల స్థానాలను మెరుగుపరిచినందుకు దీపికా పదుకొనే, విద్యాబాలన్, కంగనా రనౌత్ వంటి తోటి నటీమణులపై ప్రశంసలు కురిపించింది.

హిందీ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులు ఎలా అభివృద్ధి చెందారనే దానిపై చర్చిస్తూ కంగ‌న‌ను కూడా పొగిడేసింది క‌రీనా. చాలామంది ప‌రిశ్ర‌మ‌లో ఇతరులకు ఉదాహరణగా నిలిచారు... అని క‌రీనా అన్నారు. చాలా మంది మహిళలు బలమైన పాత్రలు చేశారని కూడా అన్నారు.

కరీనా మహిళా నటీమణులను ప‌రిశ్ర‌మ‌లో భిన్నంగా చూస్తారా? అని ప్ర‌శ్నించ‌గా, చాలా మంది వ్యక్తుల వల్ల పరిస్థితులు మారాయని అన్నారు. ఆడా మ‌గా విభేధాలు స‌మ‌సిపోయాయ‌ని కూడా అన్నారు. ఆస‌క్తిక‌రంగా ఔట్ సైడ‌ర్ అయిన కంగ‌న ప్ర‌తిభ‌ను కొనియాడ‌కుండా ఉండ‌లేక‌పోయింది క‌రీనా. ఇది నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన విష‌యం. క‌రీనా న‌టించిన క్రూ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ట‌బు, కృతి స‌నోన్ ల‌తో క‌లిసి క‌రీనా న‌టించింది. ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ ఆక‌ట్టుకుంది.