Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో లేడీ సింగం హ‌ల్చ‌ల్

హైద‌రాబాద్ లో లేడీ సింగం హ‌ల్చ‌ల్. లేడీ సింగం రాక‌తో యూనిట్ లో ఉత్సాహం రెట్టింపు అయింది.

By:  Tupaki Desk   |   8 Oct 2023 5:44 AM GMT
హైద‌రాబాద్ లో లేడీ సింగం హ‌ల్చ‌ల్
X

హైద‌రాబాద్ లో లేడీ సింగం హ‌ల్చ‌ల్. లేడీ సింగం రాక‌తో యూనిట్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. డైలీ మేల్ సింగంతో షూటింగ్ చేసిన యూనిట్ కి లేడీ సింగం రాక‌తో రీప్రెష్ మెంట్ దొరికింది. ఇంత‌కీ ఈ క‌థ అంతా ఎవ‌రి కోసం? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ `సింగం` నుంచి `సింగం ఎగైన్` రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో శ‌ర వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

తాజాగా చిత్ర యూనిట్ తో క‌రీనా క‌పూర్ కూడా యాడ్ అయింది. నిన్న‌టి రోజున అమ్మ‌డు ముంబై నుంచి హైద‌రాబాద్ కి బ‌య‌ల్దేరింది. ఆన్ ది వేలో జ‌ర్నీని ఆస్వాదించింది. రామోజీ ఫిలిం సిటీకి వెళ్లే మార్గంలో అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నిన్న‌టి నుంచే అమ్మ‌డు షూటింగ్ లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. క‌రీనా ఈ సినిమా కోసం ఎన్ని రోజులు డేట్లు కేటాయింది అన్న‌ది తెలియాలి. ఇప్ప‌టికే సినిమాలో భారీ తార‌గ‌ణం చోటు చేసుకుంది.

దీపికా ప‌దుకొణే ..అక్ష‌య్ కుమార్..ర‌ణ‌వీర్ సింగ్ లాంటి స్టార్లు న‌టిస్తున్నారు. వాళ్లకు తోడుగా క‌రీనా కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో సెట్స్ లో వాతావ‌ర‌ణం అంతా కోలాహలంగా మారింది. అయితే అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న మెయిన్ లీడ్ పోషిస్తుంది? ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. దీపిక కూడా న‌టిస్తుంటంతో ఆ ఛాన్స్ క‌రీనాకి ఇచ్చారా? దీపిక తీసుకుంటుందా? అన్న‌ది క్లారిటీ లేదు. దీపిక మాత్రం పోలీస్ అధికారిణి పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.

అజ‌య్ దేవ‌గ‌ణ్ కి ధీటుగా ఆ రోల్ ఉంటుంద‌ని వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌రీనా పాత్ర పై ఆస‌క్తి సంత‌రించుకుంది. యాక్ష‌న్ ప్రాంచైజీ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన భాగాలు మంచి విజ‌యం సాధించాయి. కాప్ యూనివ‌ర్శ్ లో ఇంత‌వ‌ర‌కూ ఫెయిల్యూర్ లేని ప్రాంచైజీ ఇది. దీంతో సింగం ఎగైన్ పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి.