Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : వయసు 43, అందాలు 23

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్ ల్లో కరీనా కపూర్‌ ఖాన్‌ శైలి విభిన్నం. 2000 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు దశాబ్ద కాలం పాటు బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 6:20 AM GMT
పిక్ టాక్‌ : వయసు 43, అందాలు 23
X

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్ ల్లో కరీనా కపూర్‌ ఖాన్‌ శైలి విభిన్నం. 2000 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు దశాబ్ద కాలం పాటు బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా పేరు ను దక్కించుకున్న ముద్దుగుమ్మ కరీనా కపూర్ ఖాన్‌ పెళ్లి, పిల్లల తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంది.


కరీనా కపూర్ ఖాన్‌ వయసు 43 ఏళ్లు.. అయినా కూడా ఆమె అంత వయసు అన్నట్లుగా అస్సలు కనిపించదు. ముఖ్యంగా ఆమె సోషల్‌ మీడియాలో షేర్ చేసే ఫోటోలు మరియు వీడియో లు చూస్తూ ఉంటే ఈమె వయసు కనీసం మూడు పదుల వయసు కూడా ఉండదేమో అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా కరీనా కపూర్ షేర్‌ చేసిన బ్లాక్ డ్రెస్ హాట్ ఫోటో షూట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. క్లీ వేస్‌ షో తో మతి పోగొట్టడమే కాకుండా కవ్వించే చూపులతో చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌ ఈ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోను చూస్తూ ఉంటే కరీనా వయసు 43 కాదు.. 23 అయ్యి ఉంటుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు వచ్చే ఏడాదిలో రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా వెబ్ సిరీస్ లు మరియు టీవీ షో లతో కూడా ఈమె ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని ఇవ్వబోతుంది. అయిదు పదుల వయసు వచ్చినా కూడా ఇదే అందంతో ఈమె అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.