Begin typing your search above and press return to search.

ఆ హీరోతో రామ్ లీల‌ వ‌దులుకున్న న‌టి!

అయితే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లకముందే బెబో కరీనా ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించింది.

By:  Tupaki Desk   |   21 April 2024 3:30 AM GMT
ఆ హీరోతో రామ్ లీల‌ వ‌దులుకున్న న‌టి!
X

ప్ర‌భాస్ `క‌ల్కి` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌వుతోంది దీపిక ప‌దుకొనే. ఈ బ్యూటీ బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ఏల్తోంది. అయితే కెరీర్ కీల‌క ద‌శ‌లో ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ తో ప్రేమ‌లో పడి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించిన గోలియోన్ కి రాస్‌లీలా `రామ్-లీలా` సినిమా చిత్రీక‌ర‌ణ‌ సమయంలో దీపికా పదుకొణె-రణవీర్ సింగ్ న‌డుమ‌ స్నేహం మొద‌లై అటుపై ప్రేమ‌గా మారింది. ఈ జంట 6 సంవత్సరాల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారు 2024 సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. అయితే సంజయ్ లీలా భ‌న్సాలీ మొదట్లో లీలా పాత్ర కోసం కరీనా కపూర్ ఖాన్‌ను ఎంపిక చేయాలని అనుకున్నారనేది చాలామందికి తెలియదు. అయితే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లకముందే బెబో కరీనా ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించింది. అనంత‌రం రణ్‌వీర్ సరసన దీపిక నటించింది.


తాజా ఇంటర్వ్యూలో కరీనాకు ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. అనుకోకుండా దీపికా- రణ్‌వీర్ జంట న‌డుమ శృంగార ర‌స పాత్రల‌ గురించి ప్ర‌శ్న వ‌చ్చింది. రణ్‌వీర్ తో గోలియోన్ కీ రామ్ లీల‌ `రామ్-లీలా`లో అవ‌కాశం త‌న‌ను వ‌రించినందుకు.. ర‌ణ‌వీర్ జీవిత భాగస్వామిగా వ‌చ్చినందుకు దీపిక‌ ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలిపారా? అని బెబోని ప్ర‌శ్నించారు. అయితే తాను విధిని నమ్ముతానని, జీవితంలో ఏది జరగాలో అది జరుగుతుందని క‌రీనా పేర్కొంది. మీ పరిస్థితులు ఎలా మార‌తాయి అనేది పైవాడి రాత‌. అంద‌రికీ విధి ఒకేలా రాసి ఉండ‌దు. ప్రతిదీ అందరి కోసం రాసి పెట్టి ఉండ‌దు.. అని అంది. ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా దానిని విడిచిపెట్టినందుకు చింతించడం లేదని తెలిపింది. బహుశా ఇది చాలా భిన్నమైన చిత్రంగా ఉండేదని క‌రీనా పేర్కొంది.

కరీనా ఇటీవల `క్రూ` ఘ‌న‌విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. ఇందులో క‌రీనాతో పాటు టబు, కృతి సనన్ కూడా నటించారు. తదుపరి రోహిత్ శెట్టి `సింఘం ఎగైన్‌`లో క‌రీనా కనిపించనుంది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఇందులో న‌టిస్తున్నారు.