Begin typing your search above and press return to search.

మ్యాడ‌మ్ మ‌రీ అలా సూట్ కాని డ్రెస్ వేస్కోవాలా?

బెబో ఈ డ్రెస్ లో ఎంతో అసౌక‌ర్యంగా క‌నిపించ‌డ‌మే కాదు ప‌ది మందిలో ఎగ‌తాళికి గురైంది. ప్ర‌స్తుతం క‌రీనా క‌పూర్ ఖాన్ ధ‌రించిన పార్టీ డ్రెస్ అంద‌రిలో హాట్ టాపిక్ అయింది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 1:30 AM GMT
మ్యాడ‌మ్ మ‌రీ అలా సూట్ కాని డ్రెస్ వేస్కోవాలా?
X

నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు త‌మ‌ను తాము యూనిక్‌గా ప్రెజెంట్ చేసుకోవాల‌ని సీనియ‌ర్ న‌టీమ‌ణులు ప‌రిత‌పించ‌డం చూస్తున్న‌దే. ఎవ‌రు ఎన్ని వేషాలు వేసినా చివ‌రికి క్లీవేజ్ షో త‌ప్ప‌నిస‌రి. ఇదిగో ఇక్క‌డ బెబో మ్యాడ‌మ్ కూడా దానికోసం చాలా ప్ర‌య‌త్నించింది. రొటీన్ కి భిన్నంగా సంథింగ్ హాట్ గా ఏదో ట్రై చేయ‌బోయి ఇదిగో ఇలా బుక్క‌యింది. దాంతో ఆమె ఫ్యాష‌న్ సెన్స్ కాస్తా అభాసుపాలైంది. బెబో ఈ డ్రెస్ లో ఎంతో అసౌక‌ర్యంగా క‌నిపించ‌డ‌మే కాదు ప‌ది మందిలో ఎగ‌తాళికి గురైంది. ప్ర‌స్తుతం క‌రీనా క‌పూర్ ఖాన్ ధ‌రించిన పార్టీ డ్రెస్ అంద‌రిలో హాట్ టాపిక్ అయింది.

నిజానికి బెబో స్టైల్ అనే ప‌దానికి నిర్వ‌చ‌నం. సైజ్ జీరో బ్యూటీగా ఒక సంచ‌ల‌నం. కానీ ఇప్పుడు ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లి. అందుకే మునుప‌టి జిగిబిగి ఇప్పుడు కుద‌ర‌దు. కానీ క‌రీనా అవేవీ ప‌ట్టించుకోకుండా ట్వంటీ మైన‌స్ యంగ్ బ్యూటీలా మెరిసిపోవాల‌ని క‌ల‌లుకంది. అంతే ఇలా పార్టీ లో స్పెష‌ల్ డ్రెస్ తో ప్ర‌త్య‌క్షం కాగానే ట్రోల‌ర్లు బ‌రిలో దిగిపోయారు. క‌రీనా ఫ్యాష‌న్ సెన్స్ ని తూర్పార‌బ‌ట్టారు.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'జానే జాన్‌'తో కరీనా కపూర్ ఖాన్ OTTలో అరంగేట్రం చేస్తోంది. జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ త‌దిత‌రులు ఇందులో తారాగ‌ణం. 21 సెప్టెంబర్ 2023 నుంచి ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం అత్యధికంగా అమ్ముడైన నవల 'డివోషన్'కి అధికారిక అనుకరణ. కీగో హిగాషినో రచించిన సస్పెక్ట్ X నుంచి స్ఫూర్తి పొందిన బుక్ ఇది.

కరీనా ఎంపిక‌లు యూనిక్ అయినా కానీ..!

ట్రైలర్ లాంచ్ కోసం ప్రత్యేకమైన బుర్గుండి స్కర్ట్ సెట్ దుస్తులను క‌రీనా ధ‌రించి వ‌చ్చింది. నెటిజన్లలో ఒక వర్గం ఈ ప్ర‌త్యేక‌మైన‌ డ్రెస్ గురించి ప్రశంసించారు. అయితే కొద్దిమంది మాత్రం ఇలాంటి డ్రెస్ లో నడవలేరని అభిప్రాయపడ్డారు.

జానే జాన్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా.. కరీనా మాట్లాడుతూ, "నేను 23 సంవత్సరాల క్రితం కంటే ఎక్కువ భయపడ్డాను. ఎందుకంటే నేను టెలివిజన్ స్క్రీన్‌పై ప్రోమోను చాలా దగ్గరగా చూస్తున్నాను. కాబట్టి ప్రజలు నన్ను వారి ఇళ్లలో దగ్గరగా చూస్తారు. నాకు భ‌యంగా ఉంది.. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు- మేమంతా చాలా కష్టపడ్డాము" అని తెలిపారు. జైదీప్ - విజయ్‌లతో కలిసి పనిచేసిన అనుభవం గురించి అడిగినప్పుడు క‌రీనా భ‌య‌ప‌డ్డాన‌ని తెలిపింది. జైదీప్ - విజయ్ నన్ను భయపెట్టారు ఎందుకంటే వారు చాలా సన్నద్ధమయ్యారు! సైఫ్ (అలీ ఖాన్) ఇప్పటికే నన్ను హెచ్చరించాడు. నువ్వు మేకప్ వేసుకుని వెళితే స‌రిపోదు..ఈ వైఖరిని మానుకోవాలి..ఎందుకంటే మీరు జైదీప్ అహ్లావత్ - విజయ్ వర్మతో కలిసి పని చేస్తున్నారు. వారు చాలా మెరుగైన హీరోలు" అని సైఫ్ సూచించార‌ట‌.