ఆ బాలీవుడ్ హీరోయిన్ ని టచ్ చేయని తెలుగు సినిమాలు..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు అందరు కూడా సౌత్ సినిమాల మీద గురి పెడుతున్నారు.
By: Tupaki Desk | 24 May 2025 8:15 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు అందరు కూడా సౌత్ సినిమాల మీద గురి పెడుతున్నారు. ముఖ్యంగా తెలుగులో భారీ బడ్జెట్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ భామలను ప్రాంతీయ సినిమాల కోసం అడిగితే చేసే ఉద్దేశం లేక ఏదేదో రీజన్స్ చెప్పే వారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అలానే ప్రాంతీయ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టిస్తూ బాలీవుడ్ భామలను కూడా మన దగ్గర నటించేలా చేశాయి.
ఐతే ఇప్పటికే బీ టౌన్ హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొనె, అలియా భట్ నుంచి దిశా పటాని, జాన్వి కపూర్ వరకు అందరు చేస్తున్నారు. ఇంకాస్త వెనక్కి వెళ్తే అప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన శిల్పా శెట్టి, కత్రినా కైఫ్ లు కూడా తెలుగు సినిమాలు చేశారు. కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన కరీనా కపూర్ మాత్రం సౌత్ సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా సైతం తెలుగు సినిమా చేస్తుంది.
రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే పీసీ కూడా టాలీవుడ్ బాట పట్టినా కూడా కరీనా కపూర్ మాత్రం ఇంతవరకు తెలుగు సినిమాల గురించి ఆలోచించలేదు. ఒకవేళ ఆమెను ఎవరు సౌత్ సినిమాల గురించి కలవలేదా ఒకవేళ కలిసినా కూడా ఆమె చేయనన్నదా అన్నది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకెళ్తున్న ఈ టైం లో కరీనా లాంటి వారు కూడా వచ్చి ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తే ఇంకాస్త కొత్త కథలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీపిక, అలియా భట్, జాన్వి తెలుగు సినిమా ఛాన్స్ అంటే మరో మాట మాట్లాడకుండా ఓకే చెప్పేలా ఉన్నారు. ఇదే బాటలో మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. కానీ కరీనా ఇప్పటివరకు ఆ ఆలోచన చేయలేదు. మరి కరీనా దాకా తెలుగు సినిమాలు వెళ్లలేదా అన్నది తెలియాల్సి ఉంది. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ క్రేజ్ సంపాదించిన కరీనా సైఫ్ తో మ్యారేజ్ తర్వాత సినిమాలు తగ్గించింది. ఐతే ఈమధ్య మళ్లీ వరుస సినిమాలు చేస్తున్న కరీనా ఇప్పటికైనా సౌత్ సినిమాల్లో చేస్తే చూడాలని ఆమె సౌత్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
