అది తినకపోతే నిద్ర పట్టదు
బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి ఎవరికైనా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఫ్యాషన్ సెన్స్ మరియు మంచి వ్యక్తిత్వానికి పేరు గాంచిన కరీనా కపూర్ రీసెంట్ గా ముంబైలో ఓ బుక్ లాంచ్ ఈవెంట్ లో మెరిసింది.
By: Tupaki Desk | 3 April 2025 7:00 PM ISTబాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి ఎవరికైనా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఫ్యాషన్ సెన్స్ మరియు మంచి వ్యక్తిత్వానికి పేరు గాంచిన కరీనా కపూర్ రీసెంట్ గా ముంబైలో ఓ బుక్ లాంచ్ ఈవెంట్ లో మెరిసింది. ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ రాసిన కొత్త బుక్ ది కామన్ సెన్స్ డైట్ ఆవిష్కరణ కార్యక్రమానికి కరీనా హాజరైంది.
ఈ కార్యక్రమంలో కరీనా కపూర్ తన డైలీ డైట్ మరియు ఆహారపు అలవాట్ల గురించి మట్లాడింది. అంతేకాదు, తనకు ఎంతో ఇష్టమైన ఒక వంటకం గురించి కూడా కరీనా వెల్లడించింది. తనకు కిచిడీ అంటే ఎంతో ఇష్టమని, రెండు మూడు రోజులు కిచిడీ తినకపోతే వెంటనే తనకు క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయని, కిచిడీ అంటే తనకు అంత ఇష్టమని పేర్కొంది.
ఈ కిచిడీ తన డైలీ రొటీన్ లో ఎంత ముఖ్యమైనదో చెప్పిన కరీనా, కిచిడీ లేకుండా తన బాడీ అసలు సర్వైవ్ అవలేదని, అది తినకపోతే తనకు నిద్ర కూడా పట్టదని, ఇంకా చెప్పాలంటే కిచిడీ లేకుండా నేను బతకలేను అని సరదాగా చెప్తూ అక్కడ ఉన్న అందరినీ నవ్వించింది.
బియ్యం, పప్పులతో చేసిన కిచిడీ, తేలికైన మసాలాలతో చేస్తారని, అందుకే అది చాలా రుచిగా ఉంటుందని, కిచిడీలో ఎన్నో పోషకవిలువలతో పాటూ తిన్న వెంటనే పొట్టలో లైట్ గా ఉంటుందని ఈజీగా డైజెస్ట్ అవుతుందని కరీనా తెలిపింది.
ఫిట్ నెస్, వెల్ నెస్ కు ఫేమస్ అయిన కరీనా తను సరైన డైట్ మెయిన్‌టెయిన్ చేయడం వల్లే ఇంత ఆరోగ్యంగా ఉన్నానని, అందులో కిచిడీ కూడా చాలా కీలక పాత్ర పోషించిందని చెప్తోంది. రుజుత దివేకర్ ఇచ్చే న్యూట్రిషన్ సలహాలు కూడా తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, వాటి వల్ల తాను ఎంతో ఫిట్ గా ఉన్నట్టు కరీనా చెప్పుకొచ్చింది.
