ప్రభాస్‌తో దీపిక.. పృథ్వీరాజ్‌తో కరీనా?
మేఘనా, అద్భుతమైన కరీనా కపూర్ ఖాన్, టీం జంగ్లీ పిక్చర్స్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది! అని అతడు వ్యాఖ్యానించాడు.
By: Tupaki Desk | 16 April 2025 8:45 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు దిగి వస్తున్నారు. ఇటీవలి కాలంలో సౌత్ లో ఏ హీరోతో అవకాశం వచ్చినా వదులుకునేందుకు హిందీ భామలు సిద్ధంగా లేరు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ట్రెండ్ రివర్స్‌లో ఉంది. సౌత్ స్టార్లను ఉత్తరాది భామలంతా రౌండప్ చేస్తున్నారు. ఇక్కడి స్టార్లను పాన్ ఇండియా స్టార్లుగా పరిగణిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇప్పటికే దీపిక పదుకొనే, దిశా పటానీ, శ్రద్ధా కపూర్ లాంటి టాప్ బాలీవుడ్ భామలు నటించారు. తదుపరి మహేష్ సరసన ప్రియాంక చోప్రా లాంటి అగ్ర కథానాయిక నటిస్తోంది.
ఇంతలోనే ఇప్పుడు మరో సౌత్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన బాలీవుడ్ అగ్ర కథానాయిక కరీనా కపూర్ ఖాన్ నటిస్తోందని తెలుస్తోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న `దైరా` చిత్రంలో కరీనా కపూర్ తో కలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారు. దైరా క్రైమ్ థ్రిల్లర్ కథాంశం.. హారర్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టించనుందని సమాచారం. దెయ్యం ఉందా లేదా? అనే ఎలిమెంట్ ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. కరీనా తొలిసారిగా పృథ్వీరాజ్ తో తెరపై జతకడుతోంది.
మేఘనా, అద్భుతమైన కరీనా కపూర్ ఖాన్, టీం జంగ్లీ పిక్చర్స్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది! అని అతడు వ్యాఖ్యానించాడు. దైరా కంటే ముందు, మేఘనా గుల్జార్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. రాజీ, చపక్, సామ్ బహదూర్ వంటి కొన్ని హార్డ్ హిట్టింగ్ సినిమాలకు మేఘనా దర్శకత్వం వహించారు. దైరా చిత్రాన్ని పాన్ ఇండియా రేంజులో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇటీవలే ప్రభాస్ `సలార్` చిత్రంతో పృథ్వీరాజ్ పేరు మార్మోగింది. అలాగే అతడు బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గా నటించాడు. ఎల్2 ఎంపూరన్ తో దర్శకనటుడిగా మరోసారి అతడి పేరు మార్మోగింది. ఇలాంటి సమయంలో పృథ్వీరాజ్ మరొక హిందీ ప్రాజెక్ట్‌పై సంతకం చేసి, అదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బెబో కరీనాతో స్క్రీన్ చేసుకోవడంపై తన ఉత్సాహాన్ని ప్రకటించాడు.
