ప్రభాస్ అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేసిన బెబో?
డార్లింగ్ ప్రభాస్ అభిమానుల్ని బెబో కరీనాకపూర్ కన్ఫ్యూజ్ చేస్తోంది. కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేర్చింది పాపం.
By: Tupaki Desk | 2 July 2025 10:19 AM ISTడార్లింగ్ ప్రభాస్ అభిమానుల్ని బెబో కరీనాకపూర్ కన్ఫ్యూజ్ చేస్తోంది. కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేర్చింది పాపం. గత కొన్ని నెలలుగా ప్రభాస్ సినిమాలో కరీనాకపూర్ ఖాన్ నటిస్తోందన్న ప్రచారంపై చాలా సందిగ్ధతలు.. అపోహలు.. కానీ ఇప్పుడు అన్నిటికీ క్లారిటీ వచ్చేయనుంది.
బెబో కరీనాను ప్రభాస్ కోసం ఒప్పించే ప్రయత్నాలు చేసిన మాట నిజం. అయితే అది సందీప్ వంగా స్పిరిట్ కోసం కాదు.. మారుతి తెరకెక్కించిన హారర్ మూవీ `ది రాజా సాబ్`లో ఒక ప్రత్యేక గీతం కోసం అని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఆ మేరకు కరీనాకు అడ్వాన్స్ కూడా ముట్టజెప్పిందని గుసగుస వినిపిస్తోంది. అయితే ఈ హారర్ థ్రిల్లర్ లో బెబో స్పెషల్ నంబర్ తో సరిపెడుతుందా.. ఏవైనా సీన్లలో కనిపిస్తుందా అన్నది తెలీదు. అయితే కరీనా టీమ్ లో చేరుతోందనే విషయంపై చిత్రబృందం కానీ, కరీనా కానీ అధికారికంగా స్పందించలేదు.
మొత్తానికి ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా మూవీ స్పిరిట్ లో కరీనా నటించదు అన్న క్లారిటీ అయితే ఇప్పటికి వచ్చింది. ఈ సినిమాలో యానిమల్ ఫేం ట్రిప్తి దిమ్రీ కథానాయికగా ఎంపికైంది. ఇంకా అందాల కథానాయికలు నటించేందుకు ఆస్కారం ఉంది. కానీ కరీనా మాత్రం ది రాజా సాబ్ కోసం బరిలో దిగే ఛాన్సుందని గుసగుస వినిపిస్తోంది. గతంలో కరీనా కొన్ని ప్రత్యేక పాటల్లో నర్తించింది. వాటికి అద్భుత స్పందన వచ్చింది. మారుతి దర్శకత్వం వహించిన ది రాజా సాబ్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
