Begin typing your search above and press return to search.

బికినీ బీచ్‌లో బెబో లుంగీ డ్యాన్స్!

బెబో క‌రీనా క‌పూర్ ఖాన్ ఏం చేసినా అది సంథింగ్ స్పెష‌ల్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఈ భామ బికినీ బీచ్ లో కొత్త వేషంతో అంద‌రికీ షాకిచ్చింది.

By:  Tupaki Desk   |   17 July 2025 7:42 PM IST
బికినీ బీచ్‌లో బెబో లుంగీ డ్యాన్స్!
X

బెబో క‌రీనా క‌పూర్ ఖాన్ ఏం చేసినా అది సంథింగ్ స్పెష‌ల్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఈ భామ బికినీ బీచ్ లో కొత్త వేషంతో అంద‌రికీ షాకిచ్చింది. త‌షాన్ గాళ్ ఈసారి గ‌ళ్ల లుంగీతో చాలా స్పెష‌ల్ గా క‌నిపించింది. బీచ్ ఇసుక‌లో లుంగీ ధ‌రించి ఇసుక‌లో స్వేచ్ఛా విహారం చేస్తోంది. త‌న‌ క‌ళ్ల‌కు గాగుల్స్, త‌ల‌పై క్యాప్ పెట్టుకుని ఫుల్ మాస్ అంటే ఏమిటో చూపించింది.

గ్రీస్‌లో లుంగీ డ్యాన్స్ చేశారా...? అంటూ ఈ ఫోటోల‌కు సింపుల్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. నిజంగా లుంగీ డ్యాన్స్ ని ఆనందించానని బెబో ఈ సంద‌ర్భంగా తెలిపింది. ఇలాంటిది తప్పక ప్రయత్నించాలి అని కూడా అంద‌రికీ సూచించింది. బెబో ఎంపిక చేసుకున్న గ‌ళ్ల లుంగీకి కాంబినేష‌న్ గా ఆరెంజ్ బ్రాలెట్‌ని ధ‌రించింది. ఈ లుక్ చూడ‌గానే బెబో నెవ్వ‌ర్ బిఫోర్! అంటూ అభిమానులు విజిల్స్ వేస్తున్నారు.

బెబో 40 ప్ల‌స్ లోను స్ట‌న్న‌ర్ అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే త‌న భ‌ర్త సైఫ్ ఖాన్ కి చెందిన వంద‌ల కోట్ల పటౌడీ సంస్థానాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోబోతోంద‌ని, కోర్టులో సైఫ్ కుటుంబానికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి అన‌వ‌స‌ర వెత‌ల్ని నెత్తికెక్కించుకునే ప‌రిస్థితుల్లో క‌రీనా క‌నిపించ‌డం లేదు.