Begin typing your search above and press return to search.

వీడియో: పాకిస్తాన్ రేవ్ పార్టీలో క‌రీనా అస‌భ్య‌క‌ర డ్యాన్స్

అయితే వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వెంటనే భారతదేశంలోని కరీనా కపూర్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   11 April 2025 11:22 PM IST
వీడియో: పాకిస్తాన్ రేవ్ పార్టీలో క‌రీనా అస‌భ్య‌క‌ర డ్యాన్స్
X

దాయాది దేశం పాకిస్తాన్‌లోని క‌రాచీలో జ‌రిగిన ఓ రేవ్ పార్టీలో స్టార్ హీరోయిన్ క‌రీనాక‌పూర్ డ్యాన్సింగ్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో థై స్లిట్ ఫ్రాక్‌లో క‌రీనా అస‌భ్యంగా న‌ర్తిస్తూ క‌నిపించింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగానే అభిమానులు షాక్ కి గుర‌య్యారు.

అయితే ఈ వీడియో క్రియేట్ చేసిన యానిమేట‌ర్ పై బెబో క‌రీనా అభిమానులు విరుచుకుప‌డ్డారు. ఇలాంటి చెత్త AI- వీడియోని రూపొందించిన వ్య‌క్తిపై దారుణంగా ట్రోల్ చేసారు. డీజే హంజా హారిస్ సోషల్ మీడియాలో దీనిని షేర్ చేయ‌గా, కరీనా AI అవతార్ పేలవంగా ఉంద‌ని విమ‌ర్శించారు. 'కభీ ఖుషీ కభీ ఘమ్' నుండి క‌రీనా ఐకానిక్ డైలాగ్ వినే ముందు బెబో ఫార్మల్ దుస్తులలో కనిపిస్తుంది. ఈ లుక్ ని రీక్రియేట్ చేసారు. ఈ వీడియో ప్రారంభంలో స్క్రీన్‌పై ఒక లైన్ లో ఇలా రాసి ఉంది. ''మీరు పాకిస్తాన్‌లోని కరాచీలో రేవ్‌లో ఉన్నారు.. కరీనా కపూర్ మీ ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది'' అని రాసి ఉంది.

అయితే వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వెంటనే భారతదేశంలోని కరీనా కపూర్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. దానిని తొలగించమని డీజేని కోరారు. ''ఈ యానిమేషన్ చాలా చెత్త‌గా ఉంది'' అని ఒక అభిమాని స్పందించ‌గా, కరీనా దేఖ్ లే ఉస్కే పెహ్లే డిలీట్ కర్ దే ప్లీజ్! అని మరొకరు వ్యాఖ్యానించారు. చెత్త నృత్య కదలికలకు బెబో కోపగించుకుంటుంద‌ని మ‌రొక‌రు వ్యాఖ్య‌ను జోడించారు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియోపై చాలా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... కరీనా కపూర్ త్వరలో మేఘనా గుల్జార్ 'దాయ్రా'లో కనిపించనుంది. దాయ్రా కథాంశం గురించి పెద్దగా లీకులేవీ రాలేదు. సుకుమారన్ ఈ చిత్రంలో పోలీసు పాత్రను పోషించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రంతో పాటు 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' తర్వాత హన్సల్ మెహతా కూడా కరీనా కపూర్‌తో మళ్ళీ కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. కరీనాకు స్క్రిప్ట్ పంపామని కూడా తెలిపారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.