Begin typing your search above and press return to search.

క‌రీనా అక్క‌సుతోనే ర‌ణ్‌వీర్‌ని చుల‌క‌న చేస్తోందా?

ర‌ణ్‌వీర్‌ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్ 2` ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తోంది.

By:  Ravindar Gorantla   |   4 April 2026 11:00 PM IST
క‌రీనా అక్క‌సుతోనే ర‌ణ్‌వీర్‌ని చుల‌క‌న చేస్తోందా?
X

ర‌ణ్‌వీర్‌ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్ 2` ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తోంది. వ‌రుస రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ స‌రికొత్త బెచ్ మార్క్‌ని క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1525 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుల దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్‌, కోలీవుడ్ స్టార్స్ ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అయితే బాలీవుడ్ నుంచి మాత్రం భారీ స్థాయి స్పంద‌న లేదు.

దీంతో చాలా మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు ఎందుకు స్పందించ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రిగింది. కార్తీక్ ఆర్య‌న్‌, అనుప‌మ్ ఖేర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ సినిమాపై స్పందించారు. ఆమీర్ ఖాన్ మాత్రం తానింకా చూడ‌లేద‌ని త‌ప్పించుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే క‌రీనా క‌పూర్ స్పందించింది. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సాధిస్తున్న విజ‌యాన్ని ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌కే ఆపాదించింది.

`ఫైనాన్షియ‌ల్ టైమ్స్‌`తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన క‌రీనా క‌పూర్ `ధురంధ‌ర్ 2`పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ సినిమా విజ‌యంలో ర‌ణ్‌వీర్ పాత్ర లేద‌ని, క్రెడిట్ అంతా ఆదిత్య‌ధ‌ర్‌కే చెందుతుంది. ఇది ఆదిత్య‌ధ‌ర్ సినిమా. ఈ మూవీ ప్రస్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఇది ఆదిత్య‌ధ‌ర్ సినిమానే అని అంటున్నారు. అయితే `ధురంధ‌ర్ `రిలీజ్‌కు ముందు వ‌ర‌కు బాలీవుడ్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంద‌ని తెలిపింది. ఈ సంద‌ర్భంగా రణ్‌వీర్ సింగ్‌పై క‌రీనా క‌పూర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నెట్టింట విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి.

అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లే ర‌ణ్‌వీర్ అభిమానుల్ని ఫీల‌య్యేలా చేశాయి. రెండు భాగాల కోసం ర‌ణ్‌వీర్ సింగ్ క‌ష్ట‌ప‌డి పని చేస్తే ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో క‌రీనా క‌పూర్ అవ‌మానించ‌డం ఏమీ బాగాలేద‌ని ఫైర్ అవుతున్నారు. చాలా కాలం త‌రువాత ర‌ణ్‌వీర్ క్యారెక్ట‌ర్ కోసం క‌ష్ట‌ప‌డి చేస్తే క‌రీనా ఇలా క్రెడిట్ మొత్తం ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌కే ఇవ్వ‌డం, ఈ సినిమా ర‌ణ్‌వీర్‌ది కాద‌ని చెప్ప‌డం ఆగ్ర‌హం తెప్పిస్తోంద‌ని ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే `ధురంధ‌ర్ ది రివేంజ్‌` బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ర్యాంపేజ్ కొన‌సాగిస్తోంది. వ‌రుస‌గా రికార్డుల్ని తుడిచిపెడుతూ ప‌లు రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. మార్చి 19న విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1525 కోట్లకు మించి వ‌సూళ్ల‌ని రామ‌ట్టి స‌రికొత్త రికార్డుల దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఇప్ప‌టికే బాహుబ‌లి, పుష్ప 2 రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టిన `ధురంధ‌ర్ 2` ..దంగ‌ల్ లైఫ్ టైమ్ వ‌సూళ్ల‌పై క‌న్నేసింది.