Begin typing your search above and press return to search.

యానిమల్‌ : ఆ విషయాలను మాట్లాడనన్న కరణ్‌

అంతా అనుకున్నట్లుగానే ఆయన చాలా పాజిటివ్‌గా యానిమల్ సినిమా గురించి స్పందించాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   12 March 2024 2:30 PM GMT
యానిమల్‌ : ఆ విషయాలను మాట్లాడనన్న కరణ్‌
X

తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్‌ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన యానిమల్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లు కాస్త దూరంలో యానిమల్ ఆగింది.

యానిమల్‌ సినిమాకు ఎంతగా ప్రశంసలు దక్కాయో అంతకు మించి విమర్శలు కూడా వచ్చాయి. సాధారణ జనాలు ఈ సినిమాను ఎందుకు చూడాలని కొందరు అంటే.. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ కథను మరీ ఇంత హింసతో చూపించాల్సిన అవసరం ఏం ఉందని కొందరు ప్రశ్నించారు.

బాలీవుడ్‌ ని చెందిన ఎంతో మంది ప్రముఖులు యానిమల్‌ సినిమా పై స్పందించారు. తాజాగా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్ కరణ్ జోహార్‌ ఈ సినిమా పై తన రివ్యూను ఇచ్చారు. అంతా అనుకున్నట్లుగానే ఆయన చాలా పాజిటివ్‌గా యానిమల్ సినిమా గురించి స్పందించాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.

దర్శకుడు తాను చెప్పాలి అనుకున్నది చాలా బాగా చెప్పాడు. అందుకోసం అతడు ఎంపిక చేసుకున్న మార్గంను విమర్శించలేం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. నైతిక విలువల పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి నేను మాట్లాడను అన్నట్లుగా కరణ్ జోహార్‌ చెప్పుకొచ్చాడు.

త్వరలో ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమాను మొదలు పెట్టబోతున్న దర్శకుడు సందీప్ వంగ ఆ తర్వాత యానిమల్‌ సినిమాకు సీక్వెల్‌ ను రూపొందించబోతున్నాడు. యానిమల్‌ కి సీక్వెల్‌ గా యానిమల్ పార్క్‌ రాబోతుంది.

యానిమల్ ను మించిన హింస యానిమల్ పార్క్ లో ఉండే అవకాశం ఉంది. ఆ సినిమా కచ్చింగా వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌ అంటూ ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే రణబీర్‌ కపూర్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాడు. అందులో ఒకటి నెగటివ్‌ షేడ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి.