Begin typing your search above and press return to search.

నోర్మూయండి అంటూ మిడిల్ ఫింగ‌ర్ చూపించాడు!

నేను ఇలాంటి వారికి చెప్పాలనుకున్నది. నా మధ్య వేలును వారికి చూపించాలనుకున్నాను! నేనెలా ఉన్నానో మీకు తెలుసా, నోరు మూసుకోండి!'' అని వ్యాఖ్యానించాడు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 3:00 PM GMT
నోర్మూయండి అంటూ మిడిల్ ఫింగ‌ర్ చూపించాడు!
X

'కాఫీ విత్ కరణ్ 8' ప్రారంభ ఎపిసోడ్‌లో కనిపించిన ర‌ణ‌వీర్ సింగ్ -దీపికా పదుకొణె భారీగా ట్రోలింగుకి గుర‌య్యారు. ర‌ణ‌బీర్ త‌న ప్రియురాలు దీపిక‌ను మొదటిసారి ఎలా కలిశాడు ? అనే పాత కథనాన్ని 'కాపీ-పేస్ట్' చేసినందుకు విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అయితే దీపిక‌ 'సాధారణ డేటింగ్' పేరుతో ఇత‌ర బోయ్ ఫ్రెండ్ గురించి ప్ర‌స్థావించ‌డాన్ని ఫ్యాన్స్ స‌హించ‌లేదు.

ఆదిత్య రాయ్ కపూర్- అర్జున్ కపూర్ గెస్ట్‌లుగా వచ్చిన తాజా ఎపిసోడ్‌లో త‌న‌ మొదటి ఎపిసోడ్‌కు వచ్చిన స్పందన తనకు కోపాన్ని కలిగించిందని హోస్ట్ క‌ర‌ణ్ అన్నాడు. దీపికా- రణవీర్‌లతో నేను చేసిన అత్యంత నిజాయితీ గల ఎపిసోడ్‌లలో ఇది ఒకటి. అత్యంత హార్ట్ ట‌చింగ్ ఎపిసోడ్ అని నేను భావించాను. ఆ ఇద్ద‌రూ మ‌న‌సులో ఉన్న వాటిపై చాలా వరకు క్లీన్ అయ్యారు అని క‌ర‌ణ్ అన్నారు. ఇదంతా హాస్యాస్పదమైన 'ఆఫ్టర్ ఎఫెక్ట్' అని భావిస్తున్న‌ట్టు చెప్పాడు.

''ఆ రియాక్షన్ నాకు కోపం తెప్పించింది. ఇది మా అత్యుత్తమ ఎపిసోడ్‌లలో ఒకటి అని నేను అనుకున్నాను. అవి అత్యద్భుతంగా నిజాయితీగా ఉన్నాయి. వారు గంభీరంగా ఉన్నారు. చాలా మాట్లాడారు.. చాలా షేర్ చేసుకున్నారు. వారు చాలా మర్యాదగా ఉన్నారు. ఆపై మీరు ఏదో అర్ధంలేని విషయాల గురించి మాట్లాడుతున్నారు.వేరొకరి వ్యక్తిగత జీవితం -వివాహం గురించి మీకు ఏమి తెలుసు? తు అప్నే ఘర్ పే దేఖ్ నా (మీ ఇంట్లో ఏమి జరుగుతుందో చూడండి).. నేను ఇలాంటి వారికి చెప్పాలనుకున్నది. నా మధ్య వేలును వారికి చూపించాలనుకున్నాను! నేనెలా ఉన్నానో మీకు తెలుసా, నోరు మూసుకోండి!'' అని వ్యాఖ్యానించాడు.

కాఫీ విత్ కరణ్ 8 కొత్త ఎపిసోడ్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు ప్రసారం అవుతాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు భాగమైన ఇతర నటీనటులలో అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, విక్కీ కౌశల్, కియారా అద్వానీ, సారా అలీ ఖాన్, రాణి ముఖర్జీ, కాజోల్, అనన్య పాండే, బాబీ డియోల్, సన్నీ డియోల్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ ఉన్నారు.