75 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత!
నేపో కిడ్స్ ని పరిచయం చేయడంలో కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటాడన్న అపవాదు ఉంది.
By: Tupaki Desk | 9 May 2025 9:04 AM ISTనేపో కిడ్స్ ని పరిచయం చేయడంలో కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటాడన్న అపవాదు ఉంది. అతడు కేవలం ఇన్ సైడర్స్ కి మాత్రమే అవకాశాలిస్తాడు కానీ ఔట్ సైడర్స్ కి ఛాన్సులు ఇవ్వడు! అన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే సహా చాలామంది నటవారసురాళ్లను వెండితెరకు పరిచయం చేసిన కరణ్ స్టార్ కిడ్స్ ని ప్రశంసిస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటాడు.
అతడి స్వభావం కారణంగా ఎప్పుడూ తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. తన ఇంట్లో పార్టీలకు అతడు ఔట్ సైడర్స్ ని కాకుండా ఇన్ సైడర్స్ ని మాత్రమే ఆహ్వానిస్తాడని వాదన ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కరణ్ జోహార్ వినిపించిన ఓ స్టోరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడు 50మంది నటులు 25మంది డైరెక్టర్లను పరిచయం చేసానని చెప్పాడు. ఇందులో స్టార్ కిడ్స్ ని వదిలేస్తే, ఇతరులంతా ఔట్ సైడర్స్ అని చెప్పాడు. తాను స్టార్ కిడ్స్ ని పరిచయం చేయడం వల్ల జనం దృష్టి వారిపైనే ఉందని, పరిశ్రమతో సంబంధం లేని వారిని పరిచయం చేసినా దానికి సరైన గుర్తింపు దక్కలేదని అతడు చెప్పాడు.
అయితే కరణ్ ఏం చేసినా అతడు ఔట్ సైడర్స్ ని అంతగా ఎంకరేజ్ చేయలేదనే అపవాదు ఉంది. ఇంతకుముందు ఔట్ సైడర్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తో వివాదం గురించి తెలిసిందే. అలాగే ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్ ని కరణ్ ఎంకరేజ్ చేయలేదు. ఔట్ సైడర్ అయిన ప్రతిభావంతుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సరైన అవకాశం కల్పించకుండా తొక్కేశాడనే అపవాదు కూడా కరణ్‌పై ఉంది. అతడు చేసిన కొన్ని తప్పిదాల కారణంగానే ప్రతిభావంతులకు అవకాశాలు దక్కలేదని ఇండస్ట్రీ కోడై కూసింది. ధర్మ ప్రొడక్షన్స్ లో సగం వాటా అమ్మేసిన కరణ్ ప్రస్తుతం మారిన మనిషి. అతడు అందరు స్టార్లతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. కార్తీక్ ఆర్యన్ తోను సినిమా చేస్తానని అతడు ప్రకటించాడు.
