Begin typing your search above and press return to search.

ఏమైనా అనుకోండ్రా బ‌య్ నేనైతే త‌గ్గ‌ను!

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కు విమ‌ర్శ‌లు కొత్తేం కాదు. నిత్యం వాటితో చెలిమి చేస్తూనే ఉంటాడు.

By:  Tupaki Desk   |   17 May 2025 10:00 PM IST
ఏమైనా అనుకోండ్రా బ‌య్ నేనైతే త‌గ్గ‌ను!
X

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కు విమ‌ర్శ‌లు కొత్తేం కాదు. నిత్యం వాటితో చెలిమి చేస్తూనే ఉంటాడు. ఇప్ప‌టికే స్టార్ కిడ్స్ ని ప‌రిచ‌యం చేయ‌డం విష‌యంలో ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడో తెలిసిందే. ప్ర‌తిభావంతుల్ని వ‌దిలేసి ఇండ‌స్ట్రీలో పేరున్న సెల‌బ్రిటీల పిల్ల‌ల్నే ప‌రిచ‌యం చేయ‌డం ప‌నిగా పెట్టుకుని ప‌ని చేస్తున్న‌ట్లు చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన `నాదా నియ‌న్` సినిమా విష‌యంలో అదే జ‌రిగింది.

ఈ సినిమా ద్వారా శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్ లాంచ్ అయింది. అలాగే సైఫ్ అలీకాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. రిలీజ్ అన‌త‌రం సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమాకు దారుణ‌మైన రివ్యూలు వ‌చ్చాయి. దీంతో క‌ర‌ణ్ మ‌రోసారి నెటి జ‌నుల‌కు దొరికిపోయాడు. ఓవైపు ట్రోలింగ్ మరోవైపు విమ‌ర్శ‌ల‌తో అంతా ఎక్కు పెట్టారు. దీనిపై ఇబ్ర‌హీం అలీఖాన్ స‌హా త‌ల్లి ఎమోష‌న్ బ్లాక్ మెయిల్ కి దిగారు.

సినిమా ప్లాప్ గురించి జ‌నాలు మాట్లాడుతుంటే? ఇబ్ర‌హీం అలీఖాన్ అనారోగ్యం గురించి డిస్క‌స్ చేసి టాపిక్ డైవ‌ర్ట్ చేసింది. తాజాగా క‌ర‌ణ్ మ‌రోసారి విమ‌ర్శ‌ల‌పై స్పందిచంఆడు. విమ‌ర్శ‌కులు ధ‌ర్మంపై త్వ‌ర‌గా దాడి చేస్తారు. కానీ మంచి సినిమా చేసిన‌ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. అప్పుడు మాట్లాడిన నోళ్లు పాజిటివ్ గా ఉంటే మాట్లాడ‌వు. ఎందుక‌లా జ‌రుగుతుంది.

ఇబ్ర‌హీం-ఖుషీక‌పూర్ ఉన్న‌త వ‌ర్గాల నుంచి వ‌చ్చిన వారైనా? వారికి మ‌నోభావాలు ఉంటాయి. వాటిని దెబ్బ తీయ‌కూడ‌ద‌ని తెలుసుకో లేక‌పోతున్నారు. ఓ విమ‌ర్శ కార‌ణంగా వాళ్ల మ‌న‌సులు ఎంత‌గా నొచ్చు కుంటాయో గ్ర‌హించ లేక‌పో తున్నారు. నెపోటిజం పేరుతో నాపై నిత‌రంత‌రం దాడ జ‌రుగుతుంది. అయినా నేను వెన‌క్కి త‌గ్గ‌ను. నా ప‌ని నేను చేసుకుంటాను. మీ ప‌ని మీరు చేసుకోండి అన్న‌ట్లు వ్యాఖ్యానించారు.