Begin typing your search above and press return to search.

ఆ బోల్డ్ సీన్స్ చెప్ప‌గానే ఆఫ‌ర్ వ‌దులుకున్న న‌టి!

ఒక సాధార‌ణ విష‌యాన్ని కూడా బో*ల్డ్ గా మార్చ‌గ‌ల నిపుణుడు క‌ర‌ణ్ జోహార్. అత‌డి షోల‌లో వ‌ల్గారిటీ పెచ్చుమీర‌డంపై చాలా డిబేట్లు న‌డిచాయి.

By:  Sivaji Kontham   |   11 Jun 2026 8:45 AM IST
ఆ బోల్డ్ సీన్స్ చెప్ప‌గానే ఆఫ‌ర్ వ‌దులుకున్న న‌టి!
X

ఒక సాధార‌ణ విష‌యాన్ని కూడా బో*ల్డ్ గా మార్చ‌గ‌ల నిపుణుడు క‌ర‌ణ్ జోహార్. అత‌డి షోల‌లో వ‌ల్గారిటీ పెచ్చుమీర‌డంపై చాలా డిబేట్లు న‌డిచాయి. కరణ్ జోహార్ టాక్ షోలలో సెలబ్రిటీలు షేర్ చేసే ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవ్వ‌డానికి కార‌ణం ఈ బో*ల్డ్ నెస్‌. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్` కి సంబంధించి దర్శకుడు కరణ్ జోహార్, నటి కృతి సనన్, టైగర్ ష్రాఫ్ మధ్య జరిగిన ఒక పాత సంభాషణ మళ్లీ నెట్టింట హల్చల్ చేస్తోంది. కియారా అద్వానీకి కెరీర్ బ్రేక్ ఇచ్చిన ఆ బోల్డ్ పాత్ర కోసం కరణ్ జోహార్ మొదట కృతి సనన్‌ను సంప్రదించినట్లు ఈ చాట్ ద్వారా స్పష్టమవుతోంది.

ఈ పాత్ర గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ... కియారా కంటే ముందే తాను కృతిని ఈ రోల్ కోసం అడిగానని.. దానికి ఆమె చాలా `ఏస్తటికల్`గా (అశ్లీలత లేకుండా అందంగా) చేయడానికి మొదట అంగీకరించిందని గుర్తుచేసుకున్నారు. అయితే కరణ్ కథను వివరించిన విధానం తనకు చాలా వింతగా అనిపించిందని కృతి సనన్ నవ్వుతూ పేర్కొంది. ముఖ్యంగా ఆ కథలో వచ్చే ఒక ప‌ర్టిక్యుల‌ర్ బో*ల్డ్ సీన్ (ఆర్గాజమ్ - వైబ్రేటర్ సీన్) చుట్టూనే మొత్తం కథ తిరుగుతుందని కృతి గ్ర‌హించింద‌ట‌.

ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత కృతి సనన్ తన తల్లి సలహా తీసుకుంది. అది ఒక సినిమాలో సీన్ అయితే ఫ‌ర్వాలేదు కానీ పూర్తిగా 20 నిమిషాల సీన్ దాని చుట్టే తిరుగుతుంది అంటే అది చేయొద్దు! అని కృతి త‌ల్లి స‌ల‌హా ఇచ్చార‌ట‌. దీంతో కృతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. కరణ్ జోహార్ నవ్వుతూ ఆ కథ కేవలం దాని గురించే కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. కృతి మాత్రం ఆ షార్ట్ ఫిలిం మెయిన్ థీమ్ అదేనని గట్టిగా వాదించింది.

కృతి సనన్ నో చెప్పిన తర్వాత ఈ పాత్ర కియారా అద్వానీ చెంతకు చేరింది. ఆ చిత్రంలో కియారా అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. త‌న‌ కెరీర్‌లోనే అది ఒక ప్ర‌త్యేక‌మైన‌ మైలురాయిగా నిలిచింది. ఒకే ఒక్క పాత్ర ఇద్దరు స్టార్ హీరోయిన్ల కెరీర్ ఎంపికలను, బాలీవుడ్‌లో వారి ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి సంబంధంచి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం కూడా ఉంది. నిజానికి క‌ర‌ణ్ జోహార్ ఈ సిరీస్ ని తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు ఆ ప్ర‌త్యేక‌మైన సీన్ లో న‌టించి వెళ్లిపోతున్న కియ‌రా అద్వాణీని మొద‌టిసారి క‌లిసాడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. ఈ సిరీస్ లో అత‌డు న‌టించ‌క‌పోయినా.. క‌ర‌ణ్ ని క‌ల‌వ‌డానికి వ‌చ్చి కియ‌రాతో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆ త‌ర్వాత ఈ జంట‌ డేటింగ్ వ్య‌వ‌హారం, ప్రేమ పెళ్లి గురించి తెలిసిందే. చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా కియ‌రాతో సంతోషంగా సెటిలైపోయాడు.