కరణ్ జోహార్ టాలీవుడ్ ప్రయత్నాల్లోనా!
టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా క్రేజ్ చూసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తెలుగు హీరోలను హిందీకి తీసుకెళ్లిపోవాలని ఎంతగా ప్రయత్నించాడో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 13 July 2025 12:00 AM ISTటాలీవుడ్ హీరోల పాన్ ఇండియా క్రేజ్ చూసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తెలుగు హీరోలను హిందీకి తీసుకెళ్లిపోవాలని ఎంతగా ప్రయత్నించాడో చెప్పాల్సిన పనిలేదు. `బాహుబలి` రిలీజ్ అయిన అనంతరం ప్రభాస్ కు ఎన్నో బంపర్ ఆఫర్లు ఇంచ్చాడు. కానీ ప్రభాస్ వాటిని లైట్ తీసుకున్నాడు. అటుపై ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ తర్వాత అలాంటి అవకాశాలు కల్పించాడు కరణ్. వాళ్లు కూడా వాటిని అంతే సున్నితంగా తిరస్కరించారు.
ఇలా ఒకసారి కాదు తెలుగు హీరోల పాన్ ఇండియా క్రేజ్ ని హిందీ మార్కెట్ ద్వారా ఎన్ క్యాష్ చేసుకోవా లని శతవిధాల ప్రయత్నించాడు. కానీ ఏ హీరో అంగీకరించ కపోవడంతో సాధ్యపడలేదు. అటుపై పూరి జగన్నా ధ్, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లతో తనకున్న పరిచయంతోనూ కొన్ని ప్రయత్నాలు చేసాడు. కానీ అలా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడాయనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగొ స్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ నుంచే సినిమాలు నిర్మించాలనుకుంటున్నారుట.
దీనికి సంబంధించి కరణ్ ఓ ప్రణాళిక కూడా సిద్దం చేసి పెట్టుకున్నాడుట. టాలీవుడ్ నుంచి ఎంత మంది పాన్ ఇండియా క్రేజ్ ఉన్ హీరోలున్నారో లిస్ట్ ఔట్ చేసుకున్నాడుట. వాళ్లందరికీ టచ్ లోకి వెళ్తున్నాడుట. కేవంల స్టార్ హీరోలనే కాదు. చిన్న హీరోలకు కూడా కరణ్ బ్యానర్ నుంచి కాల్స్ వెళ్తున్నాయట. పారితో షికం వివరాలు..ఎలాంటి కథల్లో నటించాలనుకుంటున్నారో? అడిగి అవసరమైన డేటా అంతా సంపాది స్తున్నాడుట. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ అంతా ముంబై నుంచే జరుగుతోందిట.
త్వరలోనే హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ ఆఫీస్ తీయాలని కరణ్ ప్లాన్ చేస్తున్నాడుట. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమా చేయాలన్నది కరణ్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి ముందుగా కరణ్ బ్యానర్ లో తొలి తెలుగు హీరో ఎవరవుతారో చూడాలి. కరణ్ జోహార్ బ్యానర్లో సినిమా చేయడం అన్నది జీవితారాజశేఖర్ కుమార్తెల ఆశయంగా ఓసందర్భంలో చెప్పారు. ఇప్పుడా ఛాన్స్ వాళ్లకు కూడా కరణ్ కల్పిస్తాడేమో చూడాలి.
