బాలీవుడ్‌లో ఒకే తరహా సినిమాలొస్తున్నాయి
కరణ్ జోహార్. ఇండియన్ సినిమాలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు కరణ్ జోహార్.
By: Tupaki Desk | 13 Jun 2025 3:00 AM ISTకరణ్ జోహార్. ఇండియన్ సినిమాలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు కరణ్ జోహార్. సరికొత్త ప్రేమ కథా చిత్రాలను బాలీవుడ్ కు పరిచయం చేసిన కరణ్ జోహార్ ఆ తర్వాత పలు విభిన్న సినిమాలను కూడా తెరకెక్కించి విశేష కీర్తిని అందుకున్నాడు. తాజాగా బాలీవుడ్ పరిస్థితులపై కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ లో ఈ మధ్య ఓ కొత్త విధానం మొదలైందని, దర్శక నిర్మాతలంతా ఒకేలా వ్యవహరిస్తున్నారని అన్నాడు. ఏదైనా సినిమా రిలీజై అది మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తే అదే ఐడియాతో మరికొన్ని సినిమాలను తీస్తున్నారని, దీంతో ఒకే తరహా సినిమాలను ఎన్నో చూడాల్సి వస్తుందని కరణ్ జోహార్ చెప్పాడు. ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయిందని, ఆ మూవీ తర్వాత దాన్ని ఫాలో అవుతూ చాలా మంది చారిత్రక కథలపై ఫోకస్ చేశారని అన్నాడు.
స్త్రీ, పుష్ప లాంటి సినిమాలు హిట్టయ్యాక హార్రర్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేసేవారు ఎక్కువయ్యారని, ఆ సినిమాలు హిట్ అవడానికి కారణం అవన్నీ ఆయా జానర్లలో డిఫరెంట్ సినిమాలనీ, అప్పటివరకు ఆ జానర్ లో అలాంటి సినిమాలు, కథలు రాలేదు కాబట్టే అవి హిట్టయ్యాయని, ఆ తర్వాత వాటిని ఫాలో అవుతూ చేసిన సినిమాలన్నీ ఫ్లాపులవుతున్నాయని కరణ్ పేర్కొన్నాడు.
ఇదే సందర్భంగా సినిమాటిక్ యూనివర్స్‌పై కూడా కరణ్ తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. రీసెంట్ గా తనకు సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైందని, మీరు కూడా ఏదైనా స్పై యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా అని అడిగారని, దానికి తాను సినిమానే తన యూనివర్స్ అని, మళ్లీ స్పెషల్ గా యూనివర్స్‌లు క్రియేట్ చేయడానికి తాను ఇండస్ట్రీకి రాలేదని, డిఫరెంట్ జానర్లలో కొత్త కొత్త కథలను చెప్పడమే తన బాధ్యత అని వారికి సమాధానమిచ్చినట్టు కరణ్ తెలిపాడు.
