మెగాస్టార్ వారసుడికి ఇంట్లోనే బెదిరింపులు?
అదంతా అటుంచితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ తో కరణ్ `కాఫీ విత్ కరణ్`షోకి సంబంధించిన ఒక ఎపిసోడ్ క్లిప్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 24 May 2025 3:00 PM ISTసెలబ్రిటీ చిట్ చాట్‌లతో `కాఫీ విత్ కరణ్` ఎంతగా ఫేమస్సో తెలిసినదే. బాహుబలి ప్రభాస్, ఆర్.ఆర్.ఆర్ స్టార్లు చరణ్- ఎన్టీఆర్ లను కూడా కరణ్ ఇంటర్వ్యూలు చేసాడు. వీరంతా కరణ్ సోఫాలో కాఫీలు తాగారు. ఇక రెగ్యులర్ గా హిందీ స్టార్లతో కరణ్ చాలా కాఫీలు తాగాడు... షోలు చేసాడు. కాఫీ విత్ కరణ్ ఓటీటీకి మారాక కూడా బాగానే క్లిక్ అయింది.
అదంతా అటుంచితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ తో కరణ్ `కాఫీ విత్ కరణ్`షోకి సంబంధించిన ఒక ఎపిసోడ్ క్లిప్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇందులో అభిషేక్ కి కరణ్ నుంచి ఒక ఊహించని ప్రశ్న. ``నిన్ను ఎవరు ఎక్కువగా బెదిరిస్తారు.. మీ తల్లి లేదా మీ భార్య?`` అని కరణ్ ప్రశ్నించాడు. దానికి అభిషేక్ `నా తల్లి` అని సమాధానమిచ్చాడు. అయితే అతడి చెంతే ఉన్న తన సోదరి శ్వేత మాత్రం `భార్య`(ఐశ్వర్యారాయ్) అని జోక్ చేస్తుంది. తరువాత అభిషేక్ `ఇది నా రాపిడ్-ఫైర్ రౌండ్ కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా ఉండు` అని శ్వేతను హెచ్చరించాడు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులకు షో చాలా వినోదాన్ని ఇచ్చింది. ఆడియెన్ కడుపుబ్బా నవ్వుకున్నారు. బచ్చన్ ఫ్యామిలీ ఇన్నర్ స్టోరి తెలిసిన వారికి ఇది మరింత వినోదంగా మారింది.
ప్రస్తుతం కేన్స్ 2025 ఉత్సవాల్లో మెరుస్తున్న ఐశ్వర్యారాయ్ కి ఈ పాత వీడియో క్లిప్ చేరుకోవాలని అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. కేన్స్ రెడ్ కార్పెట్ పై మెరుస్తున్న క్వీన్ ఐశ్వర్యారాయ్ పై కరణ్ - శ్వేతా పంచ్ వేసేశార్రా! అంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐశ్వర్యారాయ్ అంటే అభిషేక్ సోదరి శ్వేతాబచ్చన్ కి క్షణమైనా పొసగదని, ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. దానికి సింబాలిగ్గానే శ్వేతా కామెంట్ హైలైట్ అయింది ఈ క్లిప్‌లో. అభి-ఐష్ జంటపై ఇటీవల సాగిన ఫేక్ ప్రచారం గురించి కూడా తెలిసినదే. అభిషేక్ ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఐష్ ప్రస్తుతం తన కుమార్తె ఆరాధ్యతో పాటు కేన్స్ ఉత్సవాలలో మెరుస్తోంది. కేన్స్ లో భారతీయ సాంప్రదాయాలు, ఇతిహాసాలకు గౌరవం పెంచే దుస్తులలో ఐష్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
