సినీప్రముఖుల వాట్సాప్ గ్రూపుల్లో నీచంగా?
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇటీవల ఓటీటీ తెరను ఏల్తున్నారు. అతడు బాలీవుడ్ ని శాసించిన సినిమాల నిర్మాతగా గొప్ప గౌరవం అందుకున్నాడు.
By: Tupaki Desk | 2 July 2025 7:00 AM ISTబాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇటీవల ఓటీటీ తెరను ఏల్తున్నారు. అతడు బాలీవుడ్ ని శాసించిన సినిమాల నిర్మాతగా గొప్ప గౌరవం అందుకున్నాడు. హిందీ చిత్రసీమలో కీలక వ్యక్తులలో ఆయన ఒకరు. అయితే ఎంత గొప్ప పేరున్నా కానీ, బాలీవుడ్ వాట్సాప్ గ్రూపుల్లో అతడి గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసుకుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం.
నిజానికి సరైన కామిక్ సెన్స్ తో పంచ్‌లు వేసే కరణ్, ఛమత్కారమైన మాటలతోను మనసుల్ని గెలుచుకుంటాడు. ఇప్పుడు బాలీవుడ్ వాట్సాప్ చాట్ లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్న ఒక ఉత్సాహవంతుడి ప్రశ్నకు కరణ్ ఖంగు తిన్నాడు. ఓ లైవ్ సెషన్ లో.. కరణ్ కూడా హిందీ చిత్ర పరిశ్రమ వాట్సాప్ గ్రూపులలో భాగమై ఉంటే...వాటిలో సంభాషణల గురించి సినిమా తీయడం లేదా పుస్తకం రాయడం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? అని ఒక ప్రేక్షకుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు కరణ్ ఆశ్చర్యపోయాడు.. కానీ సమాధానం ఇచ్చాడు.
నాకు నా స్నేహితులకు వాట్సాప్ గ్రూప్‌లలో చోటు దక్కితే.. మేం కచ్ఛితంగా ముంబై నగరం వదిలి లండన్ వెళ్లిపోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. తాము స్థానికంగా నివశించలేమని కూడా ఛమత్కరించాడు. అయితే మా వాట్సాప్ గ్రూప్ లలో నిజాయితీగా చెప్పాలంటే.. తక్షణ వ్యాఖ్యలు చూస్తుంటాం. మేము ఫ్యాషన్ విమర్శకులం..సినిమా విమర్శకులం. ఆ గ్రూపులోని ప్రతిదానిపై మేము విమర్శకులం. ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ దానిని యథాతథంగా ఆ గ్రూపులో ఉంచలేం అని అన్నారు.
ప్రస్తుతం కరణ్ జోహార్ హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో `ది ట్రెయిటర్స్` షోని రన్ చేస్తున్నారు. అలాగే ధర్మ ప్రొడక్షన్స్ కాశ్మీర్ నేపథ్యంలోని ఇంటెన్స్ థ్రిల్లర్ `సర్జమీన్`ని విడుదలకు సిద్ధం చేస్తోంది. కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ , ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. సర్జమీన్ జూలై 25న జియో హాట్‌స్టార్‌లో ప్రీమియర్ కానుంది.
