Begin typing your search above and press return to search.

క‌పూర్ సిస్ట‌ర్స్ గేమ్ ప్లాన్ వెన‌క షాడో

ఇందులో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాళ్లు జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ ఇత‌రుల‌కు స్ఫూర్తిగా నిలుస్తారు.

By:  Tupaki Desk   |   14 March 2024 4:30 PM GMT
క‌పూర్ సిస్ట‌ర్స్ గేమ్ ప్లాన్ వెన‌క షాడో
X

తెలివైన ఎంపిక‌ల‌తో గొప్ప ప్ర‌ణాళిక‌తో నేటిత‌రం ముందుకు దూసుకెళ్లాలి. ఇందులో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాళ్లు జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ ఇత‌రుల‌కు స్ఫూర్తిగా నిలుస్తారు. జాన్వీ ఇప్ప‌టికే పెద్ద స్టార్. ధ‌డ‌క్ సినిమాతో హిందీ చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించిన జాన్వీ క‌పూర్ అటుపై వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్లో సోలో లీడ్ గా న‌టించి మెప్పించింది. న‌టన‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల ఎంపిక‌ల‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. న‌టిగా ప‌రిణ‌తితో మైమ‌రిపించింది.

ఇప్పుడు ఎన్టీఆర్ దేవ‌ర‌తో తెలుగులో అడుగుపెడుతోంది. త‌దుప‌రి రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆర్.సి 16లో న‌టించేందుకు సంత‌కం చేసింది. ఇది జాన్వీ క‌పూర్ కి టాలీవుడ్ లో ఘ‌న‌మైన ఆరంగేట్రం. ఇప్పుడు అక్క బాట‌లోనే జాన్వీ క‌పూర్ కూడా నార్త్ టు సౌత్ తెలివైన ప్ర‌ణాళిక‌ల‌ను క‌లిగి ఉంది. సిస్ట‌ర్స్ ఇద్ద‌రి కెరీర్ ని డిజైన్ చేయ‌డంలో షాడో పాత్ర‌ను పోషిస్తూ పాపా బోనీక‌పూర్ ధ‌న్యుడిగా నిలుస్తున్నారు.

తొలుత ఖుషీ క‌పూర్ 'ది ఆర్చీస్' అనే వెబ్ సిరీస్‌తో తెరంగేట్రం చేసింది. త‌దుప‌రి సైఫ్ ఖాన్ వార‌సుడు ఇబ్ర‌హీం స‌ర‌స‌న క్రేజీ సినిమాలో న‌టించే అవ‌కాశం అందుకుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ స‌ర‌స‌నా ఓ చిత్రంలో న‌టించ‌నుంది. ఇదిలా ఉండ‌గానే ఖుషీ సౌత్ క‌ల‌లు కంటోంద‌ని కూడా తెలిసింది. సౌత్ కి వెంట‌నే వ‌చ్చేయ‌దు. ముందు బాలీవుడ్ లో నిరూపించుకుంటుంది. అక్క‌డ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తుంది. అదే క్ర‌మంలో న‌టిగాను నిరూపించుకున్న త‌ర్వాతే సౌత్ లో అడుగు పెడుతుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో బోనీ క‌పూర్ కూడా దీనిని ఛూఛాయ‌గా స్ప‌ష్ఠం చేసారు. ఖుషీ కెరీర్ బండి నెమ్మ‌దిగా ముందుకు సాగుతుంది. త‌న‌కోసం మంచి ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని కూడా అన్నారు. ఏది ఏమైనా క‌పూర్ సిస్ట‌ర్ వెన‌క షాడో గేమ్ న‌డిపిస్తున్న బోనీ క‌పూర్ ని ప్రశంసించ‌కుండా ఉండ‌లేం. పైనుంచి వీక్షిస్తున్న ఇంద్ర‌జ (దేవ‌క‌న్య‌) అలియాస్ అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఈ దృశ్యం వీక్షించి ఎంత‌గానో ఉద్వేగానికి గుర‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి లో దేవ‌క‌న్య ఇంద్ర‌జ‌గా శ్రీ‌దేవి న‌టించి తెలుగు వారి గుండెల్లో నిలిచిన సంగ‌తిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కుమార్తెలు జాన్వీ, ఖుషీ కూడా ఆ స్థాయిని అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.