Begin typing your search above and press return to search.

కాంతార 2లో మన హీరో.. సెట్టయితే అరాచకమే..

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సినిమాలలో కాంతార సినిమా కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   8 March 2024 5:34 AM GMT
కాంతార 2లో మన హీరో..  సెట్టయితే అరాచకమే..
X

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సినిమాలలో కాంతార సినిమా కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. అసలు ఈ సినిమా విడుదలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో విడుదలైన వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది.

దర్శకుడిగా కథానాయకుడిగా రిషబ్ శెట్టి హార్డ్ వర్కింగ్ సినిమాలో స్ట్రాంగ్ గా కనిపించింది. దీంతో సినిమా కంటెంట్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్ 1 రాబోతున్న విషయం తెలిసిందే. కాంతార అసలు కథలోని అంశాలను మరింత ఫాంటసీ నేపథ్యంలో ప్రజెంట్ చేయబోతున్నారు.

ఆ మధ్య అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేశారు. తప్పకుండా ప్రీక్వెల్ అంతకుమించి అనేలా ఉండబోతోంది అని చెప్పకనే చెప్పేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని స్పెషల్ రోల్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయట. దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఇందులో మిగతా భాషల్లోని నటినటులను కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక పవర్ఫుల్ హీరోను తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అని గాసిప్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇటీవల కర్ణాటకకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని అలాగే రిషబ్ శెట్టిని కలిశాడు. అయితే తన ప్రాజెక్టుల కోసమే ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళాడు అని అలాగే కాంతార ప్రాజెక్టులో కూడా అతను ఒక భాగం కాబోతున్నాడు అని మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి.

తప్పకుండా ఒక టాలీవుడ్ హీరో అయితే కాంతారలో కనిపించబోతున్నట్లు బలమైన టాక్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ ఒకే చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఇలాంటి కాంతార లాంటి ప్రాజెక్టులో ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఆ సినిమాకు మరింత మేజర్ ప్లేస్ పాయింట్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మరొకవైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది.