Begin typing your search above and press return to search.

కాంతారా చాప్టర్ 1.. ప్లానింగ్ అంటే ఇది..!

కాంతార సక్సెస్ తో ఆ సినిమా ప్రీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈసారి సినిమాను భారీ బడ్జెట్ తో అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు

By:  Tupaki Desk   |   28 Nov 2023 1:08 PM GMT
కాంతారా చాప్టర్ 1.. ప్లానింగ్ అంటే ఇది..!
X

రిషబ్ శెట్టి సెన్సేషనల్ క్రియేషన్ కాంతార ఎలాంటి అద్భుతాలు చేసిందో తెలిసిందే. కన్నడలో రిలీజై సూపర్ హిట్టైన ఆ సినిమా ఆ తర్వాత సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నేషనల్ వైడ్ ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. 15 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమా 400 కోట్ల వసూళ్లను రాబట్టింది అంటే ఆ సినిమా హిట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కాంతార సక్సెస్ తో ఆ సినిమా ప్రీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈసారి సినిమాను భారీ బడ్జెట్ తో అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. కాంతార 2 సినిమా ఈమధ్యనే ముహుర్తం పెట్టగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలు పెంచేసింది. ఇక ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి కాంతార ది లెజెండ్ చాప్టర్ 1 సినిమాకు మరో అదిరిపోయే ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. కాంతార సీక్వెల్ లో తెలుగు, తమిళ, హిందీ భాషలకు సంబంధించిన 15 మంది నటీనటులను తీసుకుంటున్నారట.

కాంతార 1 లో అందరు కన్నడ నటులే చేశారు. కానీ సీక్వెల్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. రీచ్ ఎక్కువ అవ్వాలంటే పాన్ ఇండియా నటులతో చేయాలని ప్లాన్ చేశారు. అలా టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ అందరు కవర్ అయ్యేలా అక్కడ నటులను తీసుకుంటున్నారట. సో పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా కాంతార సీక్వెల్ రాబోతుంది.

అంతేకాదు ఈ సినిమా విషయంలో రిషబ్ శెట్టి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఆడియన్స్ కు విజువల్ ఫీస్ట్ అందించేలా ఉంటాయని తెలుస్తుంది. దాదాపు 250 నుంచి 300 కోట్ల దాకా సినిమాకు బడ్జెట్ పెట్టేస్తున్నారట. హోంబలే ప్రొడక్షన్స్ ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కించనున్నారు. మరి రిషబ్ శెట్టి ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇప్పటికే కన్నడలో తెరకెక్కిన కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలు నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ షేక్ చేయగా ఆ తర్వాత వచ్చిన కాంతార కూడా కన్నడ పరిశ్రమ సత్తా చాటింది. ఇక ఇప్పుడు కాంతార ది లెజెండ్ చాప్టర్ 1 సినిమా పెద్ద టార్గెట్ తోనే వస్తుంది. సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్తుండగా 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.