Begin typing your search above and press return to search.

కాంతార ప్రీక్వెల్ టీజర్.. ఈసారి అంతకుమించి..

ఈ ఫస్ట్ లుక్ లో రిషబ్ శెట్టి లుక్, గెటప్ అందర్నీ షాక్ కి గురి చేసింది. దానికి తోడూ బీజీయం గూస్ బంప్స్ తెప్పించింది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 8:03 AM GMT
కాంతార ప్రీక్వెల్ టీజర్.. ఈసారి అంతకుమించి..
X

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం కన్నడలో భారీ హిట్ అవడంతో ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగు, హిందీ సహా మరికొన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. దీంతో ఎవరు ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ కలెక్షన్స్ అందుకోవడంతోపాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.


కేజిఎఫ్ తర్వాత ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతోంది. 'కాంతార- ఏ లెజెండ్ చాప్టర్ 1' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రిషబ్ శెట్టి లుక్, గెటప్ అందర్నీ షాక్ కి గురి చేసింది. దానికి తోడూ బీజీయం గూస్ బంప్స్ తెప్పించింది.

కండలు తిరిగిన దేహంతో, శరీరం పై రక్తపు మరకలు, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో చిన్నపాటి అఘోరా లాగా టీజర్ లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు రిషబ్ శెట్టి. కదంబల జన్మించిన ఓ లెజెండ్ కథ ఇది అంటూ ఫస్ట్ లుక్ టీజర్ లో మేకర్స్ పేర్కొన్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.

కాంతార మూవీలో శివ(రిషబ్ శెట్టి) కథని చూపించారు. అయితే ఈ ప్రీక్వెల్ లో మాత్రం అతడి తండ్రి కథను చూపించనున్నట్లు తెలుస్తోంది. కాంతార మూవీ లో రిషబ్ శెట్టి తండ్రి, కొడుకులు గా డ్యూయల్ రోల్ చేశారు. కాంతార మూవీలో చూపించిన దాని కంటే కంటే ముందు ఏం జరిగిందనే దాని గురించి 'కాంతార చాప్టర్-1 లో చూపించబోతున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో రిషబ్ శెట్టి గెటప్ తండ్రి పాత్రకు సంబంధించింది అయ్యుంటుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాంతార మూవీని డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి మరోసారి ఈ ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ పతాకం పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.