Begin typing your search above and press return to search.

కాంతార ప్రీక్వెల్ టైటిల్ ప్ర‌క‌ట‌న‌

కనిపించని దైవం లుక్ కోసం మంత్రముగ్ధులై ఉండండి! ఇది కాంతి మాత్రమే కాదు.. ఇది దర్శనం #కాంతర చాప్టర్1 ఫస్ట్ లుక్ నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 గంటలకు విడుద‌ల‌వుతుంది'' అని వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 6:41 AM GMT
కాంతార ప్రీక్వెల్ టైటిల్ ప్ర‌క‌ట‌న‌
X

2022 కన్నడ బ్లాక్‌బస్టర్ కాంతార‌కు ప్రీక్వెల్ టైటిల్‌ను మేక‌ర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలను కూడా షేర్ చేసారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ‌ ఈ చిత్రానికి 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' అనే పేరు పెట్టారు. పోస్ట్ సారాంశం ఇలా ఉంది, ''గతంలోని పవిత్ర ప్రతిధ్వనులలోకి అడుగు పెట్టండి.. ఇక్కడ దైవత్వం ప్రతి ఫ్రేమ్‌లో అల్లుకుంటుంది. కనిపించని దైవం లుక్ కోసం మంత్రముగ్ధులై ఉండండి! ఇది కాంతి మాత్రమే కాదు.. ఇది దర్శనం #కాంతర చాప్టర్1 ఫస్ట్ లుక్ నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 గంటలకు విడుద‌ల‌వుతుంది'' అని వెల్ల‌డించారు.


ఈ పోస్ట్‌తో పాటు సూర్యుని రూపురేఖలను మండుతున్న ఎరుపు రంగు బ్యాక్‌డ్రాప్‌తో చూపించారు. ''ఇది కేవలం వెలుతురు కాదు.. ఇది దర్శనం'' అనే ట్యాగ్‌లైన్. ప్రీక్వెల్ క‌థాంశాన్ని రిషబ్ శెట్టి రాసి దర్శకత్వం వ‌హిస్తున్నారు.

ఈ సంవత్సరం మార్చిలో కాంతారావుకు ప్రీక్వెల్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇది కాంతార చిత్రంలో స‌స్పెన్స్ తో కూడుకున్న‌ సంఘటనలను అన్వేషించే క‌థాంశం. ఈ ఉగాది నూతన సంవత్సర శుభ సందర్భంగా, #కాంతార రెండవ భాగానికి రచన ప్రారంభమైందని తెలియజేసారు. ప్రకృతితో మనకున్న సంబంధాన్ని ప్రదర్శించే మరో ఆకర్షణీయమైన కథనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము వేచి ఉండలేము అని రిష‌బ్ శెట్టి బృందం ప్ర‌క‌టించింది.

సెప్టెంబర్‌లో జరిగిన SIIMA అవార్డుల వేడుక‌లో కాంతార అత్యధిక సంఖ్యలో అవార్డులను గెలుచుకుంది. ఇందులో లీడ్ పాత్రలో ఉత్తమ నటుడు, ఉత్త‌మ నటి పుర‌స్కారాల‌తో పాటు, క్రిటిక్స్, స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు - పాత్‌బ్రేకింగ్ స్టోరీ, ఉత్తమ సంగీత దర్శకుడు కేట‌గిరీల్లో పుర‌స్కారాలు ద‌క్కాయి.

కాంతార కన్నడ- తెలుగు వెర్షన్ లు 30 సెప్టెంబర్ 2022న, హిందీ వెర్షన్ 14 అక్టోబర్ 2022న విడుదల‌య్యాయి. విజయ్ కిరగందూర్ -చలువే గౌడ నిర్మించారు. ఇందులో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ త‌దిత‌రులు నటించారు. కాంతార ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది.