Begin typing your search above and press return to search.

కాంతార 2.. ఆమెకు ఛాన్స్ కావాలట

రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముందు రీజినల్ సినిమాగా కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్ ని అందుకుంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 10:32 AM GMT
కాంతార 2.. ఆమెకు ఛాన్స్ కావాలట
X

కేజీఎఫ్ తర్వాత అందరికీ దృష్టి మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది 'కాంతార' మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముందు రీజినల్ సినిమాగా కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత ఇతర భాషల్లో విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లో అత్యద్భుతమైన రెస్పాన్స్ అందుకొని బాక్సాఫీస్ ని షేక్ చేసింది. సినిమా గురించి అన్ని ఇండస్ట్రీలు చాలా రోజుల వరకు మాట్లాడుకున్నాయి.

ఆ రేంజ్ లో కాంతారా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సాధించింది. దాంతో ఇప్పుడు 'కాంతారా 2' ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ వన్ ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించిన వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో మరిన్ని పాత్రల కోసం మూవీ టీం ఆడిషన్స్ ఓపెన్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు.

30 నుండి 60 సంవత్సరాల వరకు మగవారు, 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఆడవాళ్లు ఈ ఆడిషన్స్ కి రావచ్చు. Kantara. film అనే సైట్ లో తమ ప్రొఫైల్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ఈ ఆడిషన్ కాల్ చూసిన RX100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆడిషన్ కోసం ఓపెన్ గా నన్ను ట్రై చేయండి అంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

" ఈ అవుట్ స్టాండింగ్ ఫిలింలో భాగమయేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ప్లీజ్ ఈ ఆడిషన్ కోసం నన్ను కూడా కన్సిడర్ చేయండి. నా తరఫున మీకు ఈ మెసేజ్ పంపుతున్నాను" అంటూ కాంతారా 2 ఆడిషన్స్ కి రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత.." కాంతారా చాప్టర్ వన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్నాను. ఈ ప్రాజెక్టులో నటించేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను. నేను యాక్ట్ చేసిన రీసెంట్ మూవీ మంగళవారం లో నా నటనకు ప్రశంసలు దక్కాయి.

మీరు కూడా ఈ సినిమా చూసేందుకు కొంత సమయం కేటాయించగలిగితే నేను అభినందిస్తాను. దయచేసి ఈ ప్రాజెక్టు కోసం ఆడిషన్ ప్రక్రియ గురించి సలహా ఇవ్వండి. నా పేరును మళ్ళీ పోస్ట్ చేసినందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు" అంటూ రాస్కొచ్చింది. మరి మంగళవారంలో పాయల్ రాజ్ పుత్ నటన చూసైనా రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 లో ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.