Begin typing your search above and press return to search.

కాంతార 2.. మిస్టరీ ఎప్పుడంటే?

ఇదిలా ఉంటే సలార్ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత విజయ్ కిరంగదూర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సలార్ చిత్ర విశేషాలతో పాటుగా కాంతారా2 గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:39 AM GMT
కాంతార 2.. మిస్టరీ ఎప్పుడంటే?
X

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ చేసిన కాంతారా మూవీ ఎంతపెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని భాషలలో ఆ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్ సిద్ధం అవుతోంది. కాంతార 2 టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే సలార్ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత విజయ్ కిరంగదూర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సలార్ చిత్ర విశేషాలతో పాటుగా కాంతారా2 గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. కాంతారా 2 మూవీని భారీ కాన్వాస్ పై ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఆఖరులో కానీ లేదంటే 2025 ప్రథమార్థంలో మూవీ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

మొదటి చిత్రంలో నటించిన నటీనటులు రెండో భాగంలో కొంతమంది ఉంటారని క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా ఈ మూవీ కాంతారాకి మించి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని తెలిపారు. ఇక సలార్ చిత్రం పై వస్తోన్న రూమర్స్ పైన విజయ్ కిరంగదూర్ స్పందించారు. సలార్ కన్నడ మూవీ ఉగ్రం రీమేక్ అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశారు.

సలార్ మూవీ ఇద్దరు మిత్రులకి సంబందించిన స్టోరీ కావడంతో ఉగ్రంతో పోల్చారని, అయితే రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుందని అన్నారు. ప్రశాంత్ నీల్ మేకింగ్, విజువలైజేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని, అస్సలు ఒక కథకి ఇంకో కథకి సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా సలార్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని తెలిపారు. అలాగే మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేస్తామని, యాక్షన్ ట్రైలర్ ఒకటి రెడీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

నిర్మాత విజయ్ కింరగదూర్ ఇంటర్వ్యూ ద్వారా సలార్ మీద ఉన్న డౌట్స్ కి క్లారిటీ దొరకడంతో పాటు కాంతారా 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది స్పష్టత వచ్చేసింది. ఇక సలార్ సినిమా తరువాత KGF3 కూడా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ సినిమా మాత్రం మరో దర్శక్యడితో తెరపైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో న్యూ ప్రాజెక్టు స్టార్ట్ చేయనున్నాడు.