Begin typing your search above and press return to search.

కాంతార 2 బడ్జెట్.. ఈసారి అంతకుమించి

అంచనాలు లేకుండా ప్రేక్షకులు ముందుకు వచ్చిన కాంతార సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   23 Aug 2023 7:57 AM GMT
కాంతార 2 బడ్జెట్.. ఈసారి అంతకుమించి
X

గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకులు ముందుకు వచ్చిన కాంతార సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట కన్నడలో మంచి క్రేజ్ అందుకున్న ఈ సినిమా తరువాత మిగతా భాషల్లో కూడా ఊహించని విధంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. పూర్తిగా కన్నడ నేపథ్యం ఉన్నటువంటి ఈ కథ దేశవ్యాప్తంగానే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

కాంతార సినిమాను 16 కోట్ల పెట్టుబడితో నిర్మించగా వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ స్థాయిలో సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక ఇంతగా సక్సెస్ అయినా ఈ సినిమా కంటెంట్ ను మరింతగా కొనసాగించాలి అని చిత్ర నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిలిమ్స్ వారు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంతార సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా కథానాయకుడుగా కూడా కనిపించిన రిషబ్ శెట్టి కూడా మంచి గుర్తింపును అందుకున్నాడు. అయితే ఇప్పుడు సీక్వెల్ కోసం అతను మరో సరికొత్త తరహాలో కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ చారిత్రాత్మక అంశాన్ని మరింత లోతుగా వెండితెరపై చూపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంపై కూడా నిర్మాణ సంస్థ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఎస్టిమేషన్ ప్రకారం అయితే సినిమా బడ్జెట్ 120 కోట్ల వరకు దాటుతున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో అయితే కాంప్రమైస్ కాకూడదు అని నిర్మాణ సంస్థ గట్టిగా డిసైడ్ అయ్యిందట. వీలైనంత భారీ స్థాయిలోనే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా దర్శకుడికి ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అలాగే నటీనటుల విషయంలో కూడా దర్శకుడు ఫై రేంజ్ లోనే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంతార 2 కోసం మిగతా భాషల నుంచి కూడా మరి కొంతమంది నటీనటులను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కోలీవుడ్ నుంచి ప్రముఖ నటీ నటులను కూడా దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కొన్ని పోస్ట్.ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. ఇక ఆ పనులన్నీ కూడా పూర్తయితే త్వరలోనే మరో అధికారిక ప్రకటనతో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి కాంతార 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.