వరుస విషాధాలు దేనికి సంకేతం?
వరుస సంఘటనలో 'కాంతారా' ప్రీక్వెల్ టీమ్ లో ఆందోళన మొదలైందా? తర్వాత ఎలాంటి దుర్ఘటన జరగబో తంది? అన్న టెన్షన్ యూనిట్ సభ్యుల్లో నెలకొందా? అంటే అవుననే కన్నడ మీడియా కథనాలు అంత కంతకు వెడెక్కిస్తున్నాయి.
By: Tupaki Desk | 14 May 2025 11:00 PM ISTవరుస సంఘటనలో 'కాంతారా' ప్రీక్వెల్ టీమ్ లో ఆందోళన మొదలైందా? తర్వాత ఎలాంటి దుర్ఘటన జరగబో తంది? అన్న టెన్షన్ యూనిట్ సభ్యుల్లో నెలకొందా? అంటే అవుననే కన్నడ మీడియా కథనాలు అంత కంతకు వెడెక్కిస్తున్నాయి. చిత్రీకరణ మొదలు కాగానే అడవిని నాశనం చేసారనే విమర్శలు ఎదర్కున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది.
కొత్తగా మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకూ షూటింగ్ చేసే పరిస్థితి రాలేదు. అటుపై గాలి వానకు భారీ సెట్ ధ్వంసమైంది. కొట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన సెట్ అది. అలా డబ్బు నష్ట పోవాల్సి వచ్చింది. ఈఘటనలో కొంత మంది సెట్ నిర్మాణ కార్మికులు కూడా గాయపడ్డారు. అటుపై జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ స్పాట్ కు వెళ్తోన్న బస్సు బోల్తా పడంది. ఈ ఘటన లో 20 మందికి పైగా గాయాలయ్యాయి.
ఈ మొత్తాన్ని ఒక ఎపిసోడ్ లా చూస్తే? రెండవ ఎపిసోడ్ లో ఏకంగా మరణాలే సంభవించాయి. అదే సినిమాకు పని చేస్తోన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో ఒక్కసారి టీమ్ అంతా షాక్ అయింది. ఏంటి ఇలా జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటన మరువక ముందే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న రాకేష్ పూజారి ఆన్ సెట్స్ లోనే కుప్పకూలాడు. షూటింగ్ సమయంలో గుండె పోటు రావడంతో మృతి చెందాడు.
దీంతో మరోసారి టీమ్ గుండెల్లో గుబులు మొదలైంది. వరుసగా మన సినిమాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ మధ్య రిషబ్ శెట్టిని పంజుర్లి దేవత దర్శనానికి వెళ్లగా ప్రమాదంలో ఉన్నావ్ అని రిషబ్ ని హెచ్చరించింది. జరిగిన ఘటనలు అన్ని చూస్తుంటే పంజుర్లి చెప్పినట్లే జరిగింది. వరుస దుర్ఘటనలు..రెండు మరణాల నేపథ్యంలో చిత్రీకరణ పూర్తయ్యేలోపు ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో? నన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
ఈ సంఘటనలు చూసి సెట్ కార్మికులు నిర్మాణ పనులలకు రావడానికి జంకుతున్నారుట. పంజుర్లి ఆగ్రహానికి గురికావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వెలువ డుతున్నాయి. కాంతార పంజుర్లి దేవత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రీక్వెల్ లో కాంతార ముందు కథని చెప్పబోతున్నారు. అంటే అడవిలో మాయమైన మనిషి నుంచి కథ మొదలవుతుంది.
