Begin typing your search above and press return to search.

కాంతార చాప్టర్ 1 మేకింగ్ వీడియో.. ఆ ప్రపంచాన్ని చూపించిన రిషబ్ శెట్టి

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు పూర్వ కథగా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   21 July 2025 11:17 AM IST
కాంతార చాప్టర్ 1 మేకింగ్ వీడియో.. ఆ ప్రపంచాన్ని చూపించిన రిషబ్ శెట్టి
X

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు పూర్వ కథగా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిషబ్ శెట్టి ఈ సినిమాతో మళ్లీ తనదైన మార్క్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలింస్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమాను తాజాగా పూర్తి చేసినట్టు ప్రకటించారు.


రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఇదివరకే మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మేకింగ్ గ్లింప్స్ వదిలారు. ఇందులో రిషబ్ మైక్ పట్టుకుని ప్రేక్షకుల ముందే మాట్లాడుతున్నట్లు కనిపిస్తాడు. ‘WRAP UP - JOURNEY BEGINS’ అనే టైటిల్ వచ్చిన ఈ వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. తన వాయిస్ ఓవర్‌తో “ఇది సినిమా కాదు శక్తి” అని చెప్పడం అభిమానుల్లో స్పెషల్ ఎనర్జీ ని క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాను రూపొందించడంలో వేలాది మంది శ్రమించారని.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ రిషబ్ శెట్టి తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. ఫస్ట్ పార్ట్‌తో మిస్టికల్ థ్రిల్ చూపించిన రిషబ్.. ఇప్పుడు దీనిని ఆధ్యాత్మిక యాక్షన్ ఎంటర్టైనర్‌గా మార్చబోతున్నట్టు తెలుస్తోంది. 7వ శతాబ్దంలోని కదంబ రాజ వంశం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఈసారి మరింత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఆచారానికి, ఆరాధనకు సంబంధించిన లోతైన అంశాలు చేర్చబోతున్నారు.

శూటింగ్ పూర్తయ్యింది కాబట్టి ఇప్పుడు మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నారు. ఇప్పటికే కొన్ని ఫైట్లు వన్ టేక్‌లో 500 మంది ఫైటర్స్‌తో తెరకెక్కించారు. అలాగే, విజువల్ గ్రాఫిక్స్ కూడా సినిమా హైలైట్‌గా ఉండబోతున్నాయి. అక్టోబర్ 2న దసరా కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు సంగీతం అజనీష్ లోక్నాథ్ అందించారు. సినిమాకు దర్శకత్వం, కథ, నటన అన్నింటినీ రిషబ్ శెట్టి స్వయంగా హ్యాండిల్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాతో ‘కాంతార యూనివర్స్’కి మరింత బలం చేకూరనుంది. మరి ఈసారి రిషబ్ శెట్టి చూపించబోయే ‘శక్తి’ బాక్సాఫీస్‌ వద్ద ఏ రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ గా నిలుస్తుందో చూడాలి.