కాంతార ప్రీక్వెల్ విషాదాలు..ఆస్ట్రాలజర్స్ మాటేంటీ?
అయితే అందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టారు.
By: Tupaki Desk | 16 Jun 2025 5:29 AMకన్నడ నటుడు రిషభ్ శెట్టి నటిస్తూ రూపొందిస్తున్న మూవీ 'కాంతార చాప్టర్ 1'. సైలెంట్‌గా విడుదలై మౌత్ టాక్‌తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్నాడు. 'కాంతార' సక్సెస్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం దీని చిత్రీకరణ కర్ణాటక లోని మాని జలపాతం వద్ద జరుగుతోంది. సినిమా సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందని, 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని శనివారం సాయంత్రం వార్తలు వచ్చాయి.
అయితే అందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టారు. చిత్రీకరణ సమయంలో జలాశయం వద్ద తాము ఓ సెట్ వేశామని, అది గాలికి దెబ్బతిందని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్‌లో ఎవరూ లేరన్నారు. ఈ రోజు యధావిదిగా షూటింగ్ జరుగుతోందన్నారు. అంతే కాకుండా షూటింగ్ జరిగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీపుకుంటున్నామని, గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలో షూటింగ్ చేస్తున్నామన్నారు.
ఈ ప్రీక్వెల్ మొదలైన దగ్గరి నుంచి దీన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఆ మధ్య జూనియర్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్‌లో మరణించాడు. అక్కడి నుంచే 'కాంతార చాప్టర్ 1' విషాదాల పరంపర మొదలైంది. దీని నుంచి టీమ్ తేరుకున్నారో లేదో మరో నటుడు కపిల్ ఈతకు వెళ్లి మృత్యువాతపడటం టీమ్‌ని కలవరానికి గురి చేసింది. ఈ విషాదం మరవక ముందే మరో ఇద్దరు ఆర్టిస్ట్‌లు మృతి చెందడం టీమ్‌ని షాక్‌కు గురి చేసింది.
నటుడు రాకేష్ పూజారి, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు..ఈ ఇద్దరూ హార్ట్ ఎటాక్ కారణంగా మృతి చెందారు. దీంతో అందరిలో సరికొత్త చర్చ మొదలైంది. 'కాంతార చాప్టర్ 1'ని ఓ డివైన్ ఫోక్లోర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇదే ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తోంది. దీని చుట్టూ జరుగుతున్న మరణాలు అందరి అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. ఓ దైవానికి సంబంధించిన కథని తెరపైకి ఎక్కించే క్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఎన్టీఆర్ కాలం నుంచే చూస్తున్నాం.
దైవానికి సంబంధించిన విషయాన్ని కమర్షిలైజ్ చేయడం ఇలాంటి విపరీతాలకు దారి తీస్తుందని ఓ నటుడు ఇప్పటికే చిత్ర బృందాన్ని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 2న రిలీజ్కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై కోర్ట్ కేస్‌కు సంబంధించిన కత్తి వేలాడుతోంది. దీనికి తోడు వరుసగా యూనిట్ సభ్యులు మరణిస్తుండటంతో నెట్టింట వైరల్ టాపిక్ కోసం ఎదురు చూస్తున్న ఆస్ట్రాలజర్స్ కన్ను ఈ సినిపై పడిందట. మరి వరుస పరిణామాల నేపథ్యంలో 'కాంతార ప్రీక్వెల్'పై ఆస్ట్రాలజర్స్ ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాల్సిందే.