Begin typing your search above and press return to search.

కాంతార 1: ఆంధ్ర, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్స్ ఫిక్స్!

పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన “కాంతార”కు ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్ 1పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Sept 2025 9:19 PM IST
కాంతార 1: ఆంధ్ర, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్స్ ఫిక్స్!
X

పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన “కాంతార”కు ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్ 1పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 2 వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయబోతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ఇప్పటికే టాలీవుడ్‌లో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.

తెలుగురాష్ట్రాల్లో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ప్రాంతానికి వేర్వేరు డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయ్యారు. ఉత్తరాంధ్రలో విగ్నేశ్వరా (వారాహి చలనచిత్రం ద్వారా), ఈస్ట్-వెస్ట్ గోదావరిలో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, గుంటూరులో వారాహి చలనచిత్రం, కృష్ణా జిల్లాలో కెఎస్‌ఎన్ టెలి ఫిల్మ్, నెల్లూరులో ఎస్‌వి సినిమాస్, సీడెడ్‌లో శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ (వారాహితో కలిసి) విడుదల చేయబోతున్నారు.

తెలంగాణలో (నైజాం) రీజియన్‌కి మాత్రం “మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్” పంపిణీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్లారిటీతో టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్‌లో బలమైన నెట్‌వర్క్ క్రియేట్ అవ్వగా, విడుదల సమయంలో స్క్రీన్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండబోతుందని టాక్. దీని వలన తెలుగు మార్కెట్లో “కాంతార చాప్టర్ 1”కి భారీ బజ్ ఏర్పడింది.

కేవలం డిస్ట్రిబ్యూషన్‌కి మాత్రమే కాదు, కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవబోతోందని అంచనాలు ఉన్నాయి. ఫోక్, ఫెయిత్, మిస్టరీగా సాగే ఈ కథను రిషబ్ తనదైన రియలిస్టిక్ టచ్‌తో తెరకెక్కించాడని సమాచారం. మొదటి భాగం లోకల్ ఫోక్ స్టోరీని చూపిస్తే, ఈ ప్రీక్వెల్ దాని మూలాలను, ఆధ్యాత్మికతను మరింత డీప్‌గా చూపించనుంది.

ఇక తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వడం వలన పాన్ ఇండియా రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టడం ఖాయం అని ట్రేడ్ అంచనాలు ఉన్నాయి. గతంలో కేజీఎఫ్, కాంతార తో ఇండియన్ సినిమా మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన హోంబలే, ఈసారి కూడా మరోసారి భారీ రికార్డుల కోసం సిద్ధమవుతోంది. మొత్తానికి, అక్టోబర్ 2న విడుదల కానున్న కాంతార చాప్టర్ 1కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ క్లారిటీ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా బజ్ పెరిగింది. మరి సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.