Begin typing your search above and press return to search.

'క‌న్న‌ప్ప‌'లో క‌లెక్ష‌న్ కింగ్ లేడా?

మోహ‌న్ లాల్ ..శివ‌రాజ్ కుమార్ లాంటి దిగ్గ‌జ న‌టుల్ని రంగంలోకి దించే పాన్ ఇండియానే షేక్ అవ్వాలి అంటూ ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేదు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 8:25 AM GMT
క‌న్న‌ప్ప‌లో క‌లెక్ష‌న్ కింగ్ లేడా?
X

మంచు అండ్ కో 'క‌న్న‌ప్ప' చిత్రాన్ని ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మోహ‌న్ బాబు-విష్ణు సంయు క్తంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ కాన్సాపై చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మోహ‌న్ లాల్ ..శివ‌రాజ్ కుమార్ లాంటి దిగ్గ‌జ న‌టుల్ని రంగంలోకి దించే పాన్ ఇండియానే షేక్ అవ్వాలి అంటూ ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేదు.

ఓ కీల‌క పాత్ర‌కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని కూడా సీన్ లోకి తెచ్చారు. ఇక సినిమా షూటింగ్ అంతా స్విట్జ‌ర్లాండ్ లోనే చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ అక్క‌డే ప్లాన్ చేసిన‌ట్లు విష్ణు ఇప్ప‌టికే తెలిపాడు. అక్క‌డ ప్ర‌కృతిని..అంద‌మైన ప్ర‌దేశాల్ని అద్భ‌తంగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇలాంటి చిత్రాల‌కు కేవ‌లం న్యూజిలాండ్ మాత్ర‌మే క‌రెక్ట్ అని భావించి అక్క‌డే ప్లాన్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

అలాగే హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ రింగ్స్ లాంటి చిత్రాన్ని అక్క‌డే చిత్రీక‌రించార‌ని..అదే లోకేష‌న్ లో త‌మ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని విష్ణు గ‌ర్వం చెబుతున్నారు. దేవుడి సృష్టించిన అంద‌మైన పెయింటింగ్ న్యూజిలాంటి న‌గ‌రంలో క‌న్న‌ప్ప బావోద్వేగాలు మ‌రింత ప్ర‌భావంతంగా ఉంటాయ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే ఈ సినిమాలో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు న‌టిస్తున్నారా? లేదా? అన్నది క్లారిటీ రావ‌డం లేదు.

ఆయ‌న పేరుని న‌టుల జాబితాలో ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. కేవ‌లం నిర్మాత‌గానే తెర‌పైకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మోహ‌న్ బాబు న‌టించ‌లేదా? అని కొంత‌మంది అడుగుతున్నారు. ఎలాంటి పాత్ర అయినా అవ‌లీల‌గా పోషించ‌గల నటులు? ఆయ‌న లేకుండా క‌న్న‌ప్ప ఉంటుందా? అని మ‌రికొంత మంది సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ల‌క్ష్మి ప్ర‌స‌న్న గెస్ట్ అపిరియ‌న్స్ లేదా? ఏదైనా కీలక పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశం ఉందా? అన్న‌ది సందేహంగా మారింది.