Begin typing your search above and press return to search.

కన్నప్ప అసలు సందడి.. ఆరోజే..

ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా కూడా మూవీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 March 2024 5:35 PM GMT
కన్నప్ప అసలు సందడి.. ఆరోజే..
X

మంచు విష్ణు ప్రస్తుతం వంద కోట్ల బడ్జెట్ తో తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. భక్తిరస చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహా శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా కూడా మూవీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

అలాగే మలయాళం స్టార్ మోహన్ లాల్, కన్నడ శివరాజ్ కుమార్, మంచు మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఆ స్టార్స్ కారణంగా మలయాళీ, కన్నడ భాషలలో కన్నప్ప సినిమాకి బజ్ వస్తుందని భావిస్తున్నారు. శ్రీకాళహస్తిలో యాదార్ధంగా జరిగిన కథ కావడంతో తమిళ ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు.

మహాభారతం సీరియల్ తో పాపులర్ అయినా ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇమేజ్ తో నార్త్ ఇండియాలో కన్నప్పకి మంచి బిజినెస్ జరుగుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పనులు ఎంతవరకు వచ్చాయి అప్డేట్స్ ఇవ్వడం లేదనే కామెంట్స్ కు మొత్తానికి హీరో సమాధానం ఇచ్చారు.

ఏప్రిల్ కి ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని మంచు విష్ణు తాజాగా కన్ఫర్మ్ చేశారు. అలాగే మే నెలలో ప్రభాస్ మహా శివుడి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కచ్చితంగా మహాశివుడి పాత్రలో ప్రభాస్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాడని భావిస్తున్నారు.

ఈ మూవీలో పార్వతీదేవిగా నయనతార కనిపించబోతోందని తెలుస్తోంది. మేనెలలో మహా శివుడి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మాత్రమే రివీల్ చేస్తారా లేదంటే పార్వతీదేవిగా నయనతార లుక్ కూడా రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో మహా శివుడి క్యారెక్టర్ లో ఒక స్టార్ హీరో కనిపించబోతున్నాడు.

కన్నప్ప మూవీ వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో మరిన్ని భక్తిరస చిత్రాలు టాలీవుడ్ లో తెరకెక్కే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మహా శివుడిగా సీనియర్ ఎన్టీఆర్ భూ కైలాష్ సినిమాలో కనిపించారు. శ్రీ మంజునాథ మూవీలో మెగాస్టార్ చిరంజీవి కనువిందు చేశారు. ఇప్పుడు ఒక స్టార్ హీరో ఇమేజ్ తో ప్రభాస్ ఆ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మరి ఈ లుక్ ఎంత వరకు ఆడియన్స్ కి నచ్చుతుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.