Begin typing your search above and press return to search.

కన్నప్ప కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు!

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై ఆసక్తికర వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కన్నప్ప సినిమాను ఈ ఏడాది దసరా సీజన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

By:  Tupaki Desk   |   2 Feb 2024 2:27 PM GMT
కన్నప్ప కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు!
X

మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయిన 'మహా భారతం' సీరియల్‌ను తీసిన ముఖేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అంతేకాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం శివుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతోంది. ఇటీవల న్యూజిలాండ్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇండియాకు తిరిగొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల రెండోవారంలో మొదలయ్యే తాజా షెడ్యూల్‌లో ప్రభాస్‌ జాయిన్‌ కాబోతున్నట్లు తెలిసింది. కన్నప్ప కోసం ఇప్పటికే ప్రభాస్ డేట్స్ కూడా ఇచ్చారని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై ఆసక్తికర వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కన్నప్ప సినిమాను ఈ ఏడాది దసరా సీజన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మంచు విష్ణు రిలీజ్ కు ముందు సినిమాని భారీ ఎత్తున తన ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా టైమ్ లో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఐదు భాషల్లో అక్కడి లోకల్ స్టార్స్ తో ప్రమోషన్స్ చేసి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.

దసరా టైంలో 'కన్నప్ప' లాంటి డివోషనల్ మూవీ రిలీజ్ అయితే ఆడియన్స్ మరింత ఆదరణ చూపించే అవకాశం ఉంది. ఈ సంక్రాంతి పండుగ సీజన్లో 'హనుమాన్' ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సో దసరా టైంకి కన్నప్ప ని రిలీజ్ చేస్తే కచ్చితంగా సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఆ సమయంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ఎన్టీఆర్ దేవర లాంటి సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అదే జరిగితే ఈ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఒకవేళ దసరాకి ఆ సినిమాలు రాకపోతే 'కన్నప్ప' కి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.