Begin typing your search above and press return to search.

ఏంటీ కన్నప్పలో మరో స్టార్ హీరోనా?

ఇదిలా ఉంటే మూవీలో మరో పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని సంప్రదిస్తున్నారంట. ప్రస్తుతం ఇదే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. మోహన్ బాబు, చిరంజీవికి మంచి దోస్తీ ఉంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 4:13 AM GMT
ఏంటీ కన్నప్పలో మరో స్టార్ హీరోనా?
X

మంచు విష్ణు లీడ్ రోల్ లో పాన్ ఇండియా రేంజ్ లో మంచు మోహన్ బాబు నిర్మిస్తోన్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో ఎన్నో పౌరాణిక సీరియల్స్ చేసిన ముఖేష్ కుమార్ ని కన్నప్ప కోసం ఏరికోరి తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక మోహన్ బాబు తన ఇమేజ్ ఉపయోగించి ఈ సినిమాని భారీ మల్టీ స్టారర్ చిత్రంగా మార్చేశారు. డార్లింగ్ ప్రభాస్ మూవీలో శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి యాక్టర్స్ కీలక పాత్రలు చేయడానికి ఒప్పుకున్నారు. వీరి చేరికతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే మూవీలో మరో పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని సంప్రదిస్తున్నారంట. ప్రస్తుతం ఇదే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. మోహన్ బాబు, చిరంజీవికి మంచి దోస్తీ ఉంది. అయితే కొన్ని అభిప్రాయబేధాలు కూడా వచ్చాయి. మోహన్ బాబుకి ఏదైనా అవసరం అంటే క్షణాల్లో చేయడానికి చిరంజీవి ముందుంటారు. ఈ నేపథ్యంలోనే కన్నప్పలో ఒక క్యారెక్టర్ కోసం మోహన్ బాబు చిరంజీవిని సంప్రదించారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

అలాగే చిరంజీవి కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ గా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని ఇండస్ట్రీ సర్కిల్ లో మాత్రం ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఒక వేళ నిజంగా కన్నప్ప సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే మాత్రం ఆ మూవీపై మెగా ఫ్యాన్స్ కి ఆసక్తి పెరుగే ఛాన్స్ ఉంటుంది.

అదే జరిగితే సినిమాపైన హైప్ నెక్స్ట్ లెవల్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో చేస్తున్నాడు అనే విషయం బయటకి రాగానే సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగా మీడియా ఒక్కసారిగా కన్నప్ప వైపు దృష్టి పెట్టింది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో నార్త్ ఇండియా మార్కెట్ లో ఒక హైప్ క్రియేట్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటుస్తున్నాడా లేదా అనేది క్లారిటీ వస్తే కన్నప్ప ఏ రేంజ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మరింత స్పష్టత వచ్చేసే ఛాన్స్ ఉంది.