Begin typing your search above and press return to search.

కన్నప్ప.. కాస్త సౌండ్ పెంచితే మంచిది గురు!

అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అనే ఒక్క విషయం తప్ప ఇప్పటివరకు సరైన కంటెంట్ తో బజ్ క్రియేట్ చేయలేకపోయారు.

By:  Tupaki Desk   |   12 March 2024 4:02 AM GMT
కన్నప్ప.. కాస్త సౌండ్ పెంచితే మంచిది గురు!
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హై విజువల్స్ తో నెవ్వర్ బిఫోర్ అనేలా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చెబుతున్నారు. ఇక దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు టాక్. మంచు మోహన్ బాబుతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. మలయాళం స్టార్ మోహన్ లాల్, కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నాడు.

హిందీలో ఇతిహాస కథలని సీరియల్స్ గా తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప మూవీ తెరకెక్కుతోంది. పౌరాణిక ఇతిహాస కథ బేస్ చేసుకొని రియల్ గా జరిగిన సంఘటనల స్ఫూర్తితో కన్నప్ప కథని సిల్వర్ స్క్రీన్ పై దృశ్యకావ్యంగా ఆవిష్కరిస్తున్నారు. పవర్ ఫుల్ ట్రైబల్ వారియర్ మహా శివభక్తుడుగా ఎలా మారాడు అనేది కన్నప్ప కథలో చూపించబోతున్నారు.

ఈ సినిమాలో మహాశివుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఓ విధంగా ప్రభాస్ చేస్తోంది క్యామియో రోల్ మాత్రమే. అయితే సినిమాపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదు. పాన్ ఇండియా సినిమా అంటే మినిమమ్ ఉండాలి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అనే ఒక్క విషయం తప్ప ఇప్పటివరకు సరైన కంటెంట్ తో బజ్ క్రియేట్ చేయలేకపోయారు.

రీసెంట్ గా మహాశివరాత్రి సందర్భంగా మంచు విష్ణు ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు. అది తెలుగులో తప్పితే మిగతా భాషల్లో కొంత కూడా ఇంపాక్ట్ చూపలేదు. కొంచెం ప్రమోషన్స్ తో ఇతర బాషల్లోనే నటీనటులతో విడుదల చేయించి ఉంటే బాగుండేదేమో. మంచు విష్ణు గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో ఉన్న విషయం తెలిసిందే. అయిన కూడా రిస్క్ చేసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మంచు విష్ణు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కంటెంట్ మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే సినిమాకు మంచి బిజినెస్ జరగాలి అంటే ఇప్పటి నుంచే మరింత హైప్ పెంచాలి. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో అతని ఇమేజ్ కన్నప్పని ఎంతో కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ వైడ్ గా ఆడియన్స్ కి సినిమాని రీచ్ చేయడానికి ప్రభాస్ కటౌట్ ఉపయోగపడుతుంది.

ఇక ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఉంటే మాత్రమే లాంగ్ రన్ లో మూవీకి పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సినిమాలో విషయం లేకపోతే ప్రభాస్ ఇమేజ్ కూడా సేవ్ చేయలేదని రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు ప్రూవ్ చేశాయి. మరి మంచు విష్ణు ఎంతో కాన్ఫిడెన్స్ తో తెరపైకి తీసుకు వస్తున్న కన్నప్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.