Begin typing your search above and press return to search.

బడ్జెట్ మించుతున్నా ఎక్కడ తగ్గని కన్నప్ప..!

అంతేకాదు ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఒకటైతే ఇప్పుడు ఈ కాస్టింగ్ అంతా రావడం వల్ల సినిమాను మరింత భారీగా తీసేందుకు సిద్ధపడుతున్నారట.

By:  Tupaki Desk   |   18 April 2024 5:01 AM GMT
బడ్జెట్ మించుతున్నా ఎక్కడ తగ్గని కన్నప్ప..!
X

కెరీర్ అటా ఇటా తేల్చుకోవాలనుకుని డిసైడ్ అయిన టైం లో తమ శక్తికి మించి ఫైట్ చేసేందులు సిద్ధం అవుతుంటారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ గౌడ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కన్నప్ప. 100 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయాలని మొదలు పెట్టిన ఈ సినిమా రోజు రోజుకి బడ్జెట్ పెరుగుతూ పోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో భారీ తారాగణం సినిమాపై ఒక రేంజ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

మంచు విష్ణు కన్నప్పలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటం సినిమాపై ఒక భారీ హైప్ తెచ్చేందుకు ఉపయోగపడుతుంది. ప్రభాస్ ను సరిగా వాడుకుంటే మాత్రం టికెట్లు తెగేందుకు అతను ఒక బిగ్ రీజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక మరోపక్క కన్నడ శివ రాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ ఇలా స్టార్ కాస్టింగ్ తో కన్నప్పని ఒక భారీ మల్టీస్టారర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు.

లేటెస్ట్ గా సినిమా కోసం బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని కూడా దించారు. సినిమాలో అక్కీ భాయ్ లార్డ్ శివ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. శివుడిగా అక్షయ్ కుమార్ నందీశ్వరుడిగా ప్రభాస్ అసలు ఈ కాంబినేషన్ వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. తీసుకున్న స్టార్ కాస్ట్ అంతటినీ పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం మంచు విష్ణు కన్నప్ప నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పరచుకోవడం జరుగుతుంది.

అంతేకాదు ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఒకటైతే ఇప్పుడు ఈ కాస్టింగ్ అంతా రావడం వల్ల సినిమాను మరింత భారీగా తీసేందుకు సిద్ధపడుతున్నారట. అందుకే మంచు విష్ణు ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రూపొందిస్తున్నారని తెలుస్తుంది. కెరీర్ లో అది కూడా తను ఏమాత్రం ఫాం లో లేని టైం లో మంచు విష్ణు చేస్తున్న ఈ సాహసం అతన్ని రిస్క్ లో పడేలా చేస్తుందా లేదా ఇన్నేళ్ల తన కష్టానికి ప్రతిఫలం దక్కేలా చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా సినిమాలో యాడ్ అవుతున్న తారాగణం చూస్తుంటే మాత్రం మంచు విష్ణు కన్నప్పను తక్కువ అంచనా వేయడానికి మాత్రం లేదని అర్ధమవుతుంది. సినిమా నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ మాత్రమే వదలగా త్వరలో సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.