Begin typing your search above and press return to search.

సేఫ్ సైడ్ ఉండేలా కన్నప్ప ప్లాన్..!

రిస్క్ చేస్తేనే కానీ కెరీర్ కొనసాగించే ఛాన్స్ లేదని తెలిసి స్టార్స్ అంతా కూడా ఒళ్లు హూనమయ్యేలా కష్టపడుతున్నారు

By:  Tupaki Desk   |   15 April 2024 8:30 AM GMT
సేఫ్ సైడ్ ఉండేలా కన్నప్ప ప్లాన్..!
X

రిస్క్ చేస్తేనే కానీ కెరీర్ కొనసాగించే ఛాన్స్ లేదని తెలిసి స్టార్స్ అంతా కూడా ఒళ్లు హూనమయ్యేలా కష్టపడుతున్నారు. సినిమా సినిమాకు వారి రేంజ్ పెంచుకుంటూ తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించే స్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు కెరీర్ లో భారీ రిస్క్ చేస్తున్నాడు. అతను లీడ్ రోల్ లో కన్నప్ప అంటూ క్రేజీ సినిమా చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో కన్నప్ప అంటూ ఒక గొప్ప అటెంప్ట్ చేస్తున్నాడు విష్ణు.

తన కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా కన్నప్పను తీస్తున్న మంచు విష్ణు ఈ సినిమాతో కెరీర్ ని మరోసారి సెట్ రైట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో చేస్తున్న కన్నప్ప ప్లానింగ్ విషయంలో కూడా మంచు విష్ణు పర్ఫెక్ట్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుండగా రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

మంచు విష్ణు కన్నప్ప సినిమాను అక్టోబర్ లో దసరా బరిలో దించుతారన్న టాక్ ఉంది. అయితే దసరాకి దేవర ఆల్రెడీ ఖర్చీఫ్ వేశాడు. అసలే ఫ్యాన్స్ అందరికీ కాలర్ ఎగరేసే సినిమా అంటూ దేవరపై స్వయంగా తారక్ అంచనాలు పెంచేస్తున్నాడు. ఇదే కాకుండా సూపర్ స్టార్ రజినికాంత్ వేట్టయాన్ సినిమా కూడా దసరాకి టార్గెట్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల మధ్య కన్నప్ప వస్తే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర టఫ్ ఫైట్ జరుగుతుంది. మంచు విష్ణుకి ప్రస్తుతం అంత గొప్ప మార్కెట్ లేదు. రెండేళ్ల క్రితం జిన్నా సినిమాతో వచ్చిన విష్ణుని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కన్నప్ప అంటూ ఒక గొప్ప ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. ఈ సినిమా విపరీతమైన పోటీ మధ్యలో రిలీజ్ చేస్తే కచ్చితంగా సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే దసరాని స్కిప్ చేసి సోలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం మంచు హీరోకి ఉన్న మార్కెట్ దృష్ట్యా అలా అయితేనే కన్నప్ప కాస్త సేఫ్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈమధ్య టీజర్, ట్రైలర్ తో హైప్ వస్తే చాలు అందులో నటించింది ఎవరన్నది చూడకుండా సినిమాపై బజ్ పెంచెస్తున్నారు ఆడియన్స్. సో కన్నప్ప ను కూడా టీజర్ తోనే హైప్ తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే సినిమా నుంచి ఒక టీజర్ రాబోతుందని టాక్. దసరా మిస్ అయితే కన్నప్ప డిసెంబర్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి కన్నప్పగా మంచు విష్ణు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.