Begin typing your search above and press return to search.

కన్నప్పతో మంచు విష్ణు కఠోర పరీక్ష

నేడు అధికారం గా మంచి మోహన్ బాబు ఆధ్వర్యంలో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తోనే సినిమాను రూపొందించబోతున్నట్లు గతంలో విష్ణు తెలియజేశాడు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 11:52 AM GMT
కన్నప్పతో మంచు విష్ణు కఠోర పరీక్ష
X

మంచు ఫ్యామిలీలో ఒకప్పుడు ఇద్దరు యువ హీరోలు కూడా చాలా వేగంగానే సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక వరుస డిజాస్టర్స్ మాత్రం ఆ ఇద్దరి స్పీడ్ కు ఊహించని విధంగా బ్రేకులు వేశాయి. చిన్నబ్బాయి మంచి మనోజ్ కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా పెద్ద హీరో మంచి విష్ణు మాత్రం అసలు గ్యాప్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అతని చివరి సినిమాలు ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విష్ణు తదుపరి సినిమాతో మాత్రం సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చూస్తున్నాడు. చివరగా జిన్నా అనే సినిమా చేసిన మంచు విష్ణు కు మరికొన్ని కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ వాటిని చేయడానికి ఇష్టపడలేదు. ఇక ఇప్పుడు ఫ్యాన్ ఇండియా రూట్లో వెళ్లి సరికొత్తగా సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి భక్త కన్నప్ప ప్రాజెక్ట్ ను శుక్రవారం రోజు అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది.

పరమశివుడి భక్తుడిగా కన్నప్ప స్టోరీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి కథను గతంలో చాలామంది ట్రై చేశారు ఇక అందులో ప్రముఖంగా కన్నప్ప అనే పేరు వినగానే అందరికీ కూడా రెబల్ స్టార్ కృష్ణంరాజు గుర్తుకు వస్తారు. బాపు దర్శకత్వంలో ఆయన చేసిన ఆ సినిమాకు అప్పట్లో ఒక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

మళ్లీ ఆ తర్వాత ఆయనే ప్రభాస్ తో చేస్తారనే చెప్పారు. కానీ అది జరగలేదు. ఇక మంచు విష్ణు మాత్రం గత కొంతకాలంగా కూడా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. నటుడు తనికెళ్ల భరణి కూడా ఒక వెర్షన్ స్టోరీ రాశారు అని ఆ మధ్య వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు నార్త్ లో టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప కథను సరికొత్తగా తెరపై తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

నేడు అధికారం గా మంచి మోహన్ బాబు ఆధ్వర్యంలో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తోనే సినిమాను రూపొందించబోతున్నట్లు గతంలో విష్ణు తెలియజేశాడు. ప్రస్తుతం హిందూ భక్తి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే వస్తోంది. ఇక ఆ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని సినిమాను పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేయడం కూడా పెద్ద పరీక్ష. మరి ఈ పరీక్షలో మంచి విష్ణు ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.