Begin typing your search above and press return to search.

కన్నప్ప.. క్యామియోతో కాస్త జాగ్రత్త..?

ఇదిలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 4:31 AM GMT
కన్నప్ప.. క్యామియోతో కాస్త జాగ్రత్త..?
X

ఈ మధ్యకాలంలో క్యామియో రోల్స్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ చేశారు. ఆ రెండు పాత్రలని నెల్సన్ దిలీప్ కథలో భాగంగా కరెక్ట్ గా ఉపయోగించుకోవడం వలన ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యాయి. స్టార్ యాక్టర్స్ అయిన కూడా కథకి యాప్ట్ అయ్యే విధంగా వాడుకుంటే కచ్చితంగా మూవీకి వారు ప్లస్ అవుతారు.

గతంలో బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యామియో రోల్ పోషించిన సినిమాకి ఎలాంటి ఉపయోగం కలగలేదు. చిత్రానికి ఎక్స్ ట్రాగా వచ్చిన మైలేజ్ కూడా లేదు. తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన లాల్ సలామ్ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ క్యామియో రోల్ చేశారు. సినిమాని ఆయన పోస్టర్ పెట్టి ప్రమోట్ చేశారు. నిర్మాత కూడా రజినీకాంత్ ఉన్నారని భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు.

అయితే లాల్ సలామ్ సినిమాకి రజినీకాంత్ స్టార్ ఇమేజ్ ఎలాంటి హైప్ తీసుకురాలేదు. మొదటి రోజు ఈ చిత్రానికి నామమాత్రపు కలెక్షన్స్ వచ్చాయి. లాల్ సలామ్ మూవీని రజినీకాంత్ పేరుతో ప్రమోట్ చేసిన, ట్రైలర్ సూపర్ స్టార్ మీద కట్ చేసి వదిలారు. అయితే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మూవీగా మాత్రం ఆడియన్స్ తీసుకోలేదు. ఆ ప్రభావం కలెక్షన్స్ మీద స్పష్టంగా కనిపించింది.

ఇదిలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది. మంచు విష్ణు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో పాటు మోహన్ లాల్ కూడా ఈ మూవీలో ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తో కన్నప్ప సినిమాకి హైప్ వస్తుందని భావిస్తున్నారు.

ఇక లాల్ సలామ్ మూవీ తరహాలోనే కన్నప్పకి కూడా ప్రభాస్ క్యామియో హైప్ తీసుకు వస్తుందా లేదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. క్యామియో రోల్స్ మాత్రమే కాకుండా సినిమా కంటెంట్ కూడా బలంగా ఉంటే కచ్చితంగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సూపర్ స్టార్ ఉన్నాడు కదా అని ప్రమోషన్స్ విషయంలో కూడా అశ్రద్ధ చూపిస్తే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని లాల్ సలామ్ నిరూపించింది.

మంచు విష్ణు అలాంటి పొరపాటు చేయకుండా ఉంటే బెటర్. ప్రభాస్ ప్రస్తుతం రైజింగ్ స్టార్ గా ఉన్నాడు. తన స్టార్ డమ్ గ్లోబలైజ్ చేసుకుంటున్నాడు. కచ్చితంగా క్యామియో కలిసొచ్చే విషయమే. మరి ఈ ప్లస్ పాయింట్స్ ను మంచు విష్ణు ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.