కన్నప్ప ఖర్చులు.. వాళ్ళందరూ ఎంత తీసుకున్నారు?
టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా దూసుకెళ్తోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 5:37 PM ISTటాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా దూసుకెళ్తోంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రానికి కథ, నిర్మాణ విలువలు, నటీనటుల ఎంపిక ఇలా అన్ని కూడా బాగా కుదిరాయి. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మోహన్ బాబు నిర్మాణంలో విష్ణు చేసిన అద్భుత ప్రయత్నం ఫ్యాన్స్‌కు కనెక్ట్ అయింది.
విష్ణు ఈ చిత్రాన్ని తన జీవితంలో ఒక మైల్ స్టోన్ మూవీగా తీర్చిదిద్దేందుకు భారీగానే ఖర్చు చేశారా లేదా అనే దానిపై అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక గ్రాఫిక్స్, విజువల్ ట్రీట్‌మెంట్ పరంగా అంచనాలకు మించిన స్థాయి కనిపించలేదని కొందరు భావిస్తున్నారు. అయితే హీరోగా విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి నిర్మించడంవల్ల కొన్ని ఖర్చులు తగ్గినట్లు స్పష్టమవుతోంది.
ఈ సినిమా కాస్టింగ్ పరంగా చూస్తే… స్టార్ కాస్టింగ్ ఉన్నా పారితోషికాల విషయంలో విష్ణు ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రభాస్, మోహన్‌లాల్ వంటి స్టార్‌లు సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని విష్ణు స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా ప్రభాస్ చేసిన పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తోంది. మోహన్‌లాల్ పాత్ర చిన్నదైనా ఆకట్టుకునేలా ఉండటంతో వారి సహాయానికి విష్ణు కృతజ్ఞతలు తెలిపాడు.
అదే సమయంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాత్రం పారితోషికం తీసుకున్న ఏకైక నటుడు అని సమాచారం. ఆయన్ను 5 రోజుల షూట్‌కు రప్పించేందుకు దాదాపు రూ.10 కోట్లు చెల్లించారట. అంటే రోజుకు సుమారుగా రూ.2 కోట్ల చొప్పున. శరత్ కుమార్ కూడా మంచి లెంగ్త్ క్యారెక్టర్ చేశారని, కానీ ఆయన్ను మోహన్ బాబు దగ్గరితనం వల్ల పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే, మొత్తం చిత్ర ఖర్చుల్లో రెమ్యూనరేషన్ భాగం పరిమితంగా ఉండటం విశేషం.
ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ పరంగా మాత్రం భారీగా రాబడి వచ్చే అవకాశముంది. ఈ రెండు డీల్స్ ఇప్పటి వరకు క్లోజ్ కాకపోయినా… త్వరలోనే ఓ మంచి డీల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారానే అసలు విష్ణు పెట్టుబడి ఎంత వరకు తిరిగి వస్తుందో తెలుస్తుంది.
ఏదేమైనా కన్నప్ప సినిమా విష్ణుకు ఒక పర్ఫెక్ట్ మార్కెట్‌ను అందించిందనే సంగతి అర్థమవుతోంది. స్టార్ కాస్టింగ్ తీసుకున్నా, స్వయంగా మేనేజ్ చేయడంతో ఖర్చులు సమతూకంగా ఉంచడంలో విష్ణు విజయవంతం అయ్యారు. ఇప్పుడు అసలైన లాభనష్టాల లెక్కలు ఓటీటీ శాటిలైట్ డీల్స్ తేలనున్నాయి. మరి చివరికి విష్ణు ఈ సినిమాతో ఎలాంటి ప్రాఫిట్స్ అందుకుంటాడో చూడాలి.
