Begin typing your search above and press return to search.

ఆ స్టార్ చేతుల మీదుగా కన్నప్ప ట్రైలర్.. గ్రాండ్ ప్రమోషన్‌తో డబుల్ బజ్

ఈ రోజు సాయంత్రం కన్నప్ప ట్రైలర్‌ను గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ప్రత్యేకంగా కొచ్చి నగరాన్ని ఈ వేడుక కోసం ఎంపిక చేశారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 2:42 PM IST
ఆ స్టార్ చేతుల మీదుగా కన్నప్ప ట్రైలర్.. గ్రాండ్ ప్రమోషన్‌తో డబుల్ బజ్
X

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, రొమాంటిక్ క్వీన్ కాజల్ అగర్వాల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ వంటి స్టార్ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఇక ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్నారు. విష్ణు కెరీర్‌లో ఇదే అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచగా, ఇప్పుడు మేకర్స్ ట్రైలర్‌ రిలీజ్ కు సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం కన్నప్ప ట్రైలర్‌ను గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ప్రత్యేకంగా కొచ్చి నగరాన్ని ఈ వేడుక కోసం ఎంపిక చేశారు.

అంతేకాదు, ఈ ట్రైలర్‌ను లాంఛనంగా విడుదల చేస్తున్నది మరెవరో కాదు.. మలయాళ మాస్ కింగ్ మోహన్ లాల్‌. ఆయన ఈ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరవుతుండటంతో ఈ వేడుకపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ట్రైలర్ డ్యూరేషన్ 2 నిమిషాల 50 సెకన్లుగా ఉండనుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ట్రైలర్ విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చాలా గ్రాండ్‌గా ఉన్నాయని టాక్.

ప్రత్యేకంగా కన్నప్ప చూపించిన అఖండ విశ్వాసాన్ని శక్తివంతంగా చూపించారని తెలుస్తోంది. ఇందులో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా నిలిచేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్, అక్షయ్ లుక్‌లు కూడా ట్రైలర్‌లోనే సర్ప్రైజ్‌గా చూపించబోతున్నారని టాక్. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రమోషన్స్ ముగించిన మేకర్స్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కన్నప్ప ప్రమోషన్స్‌ను దూకుడుగా నిర్వహిస్తున్నారు.

ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో హైప్‌ను పెంచుతున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ రెట్టింపు అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మైథలాజికల్ డ్రామా అయినా కూడా యంగ్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా రూపొందిందని మంచు విష్ణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న కన్నప్ప సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.