Begin typing your search above and press return to search.

మంత్రుల ప్రశంసలతో ‘కన్నప్ప’కి మాసివ్ బూస్ట్

ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి మౌత్‌టాక్‌తో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న ఈ సినిమాను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నాయకులు ప్రత్యేకంగా వీక్షించారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 3:45 PM IST
మంత్రుల ప్రశంసలతో ‘కన్నప్ప’కి మాసివ్ బూస్ట్
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథలాజికల్ విజువల్ వండర్‌గా నిలిచిన సినిమా కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రానికి అన్ని భాషల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విష్ణు కన్నప్ప పాత్రలో నటించగా, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్‌లు కీలక పాత్రల్లో కనిపిప్రస్తుతవర్‌ఫుల్ సంగీతంతో, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తోంది.


ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి మౌత్‌టాక్‌తో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న ఈ సినిమాను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నాయకులు ప్రత్యేకంగా వీక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి ప్రముఖులు ఆదివారం రాత్రి నిర్వహించిన స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, విష్ణు మంచు కూడా హాజరయ్యారు.


సినిమాను చూసిన అనంతరం డిప్యూటీ సీఎం మల్లూ భట్టి మాట్లాడుతూ, “కన్నప్ప ఊహకు మించి ఉంది. విష్ణు మూడు డైమెన్షన్లలో నటించాడు.. తిన్నడు, కన్నప్పగా అతను నటన అద్భుతం. మోహన్ బాబు గారి నిర్మాణ విలువలు ప్రశంసించదగ్గవి. ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అలాగే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, “చాలా రోజుల తర్వాత ఓ గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. శివ భక్తులకు ఇది ఒక ఎమోషనల్ ఫెస్టివల్ లా ఉంటుంది. ఈ తరహా సినిమాలు మరింతగా రావాలి. మన పురాణగాథలను సినిమాల రూపంలో అందించాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా నేను ఎప్పుడూ ఇలాంటి కథలకు మద్దతు ఉంటాను,” అని పేర్కొన్నారు.


ఈ స్పెషల్ స్క్రీనింగ్ వల్ల కన్నప్పపై మరోసారి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయింది. మంత్రి స్థాయిలో ఇలా సినిమా ప్రదర్శన జరగడం, ఆ తర్వాత వారు ఇచ్చిన స్పందన సినిమాకు లాంగ్ రన్‌లో మంచి సపోర్ట్ కలిగించనుంది. ఇప్పటికే భక్తి సాహిత్యాన్ని ఆధారంగా చేసుకున్న ఈ కథకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం విశేషం. మొత్తంగా చెప్పాలంటే, ఈ తరహా పాజిటివ్ వైబ్ కన్నప్ప చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా మార్చే దిశగా తీసుకెళ్తున్నాయి. విష్ణు నటన, మోహన్ బాబు నిర్మాణం, దేవభక్తి నేపథ్యం… ఈ చిత్రాన్ని ఒక స్పెషల్ సినిమాగా నిలబెట్టాయని మేకర్స్ చెబుతున్నారు.