'కన్నప్పకు అంత బడ్జెట్ అవసరమా? భక్తి మిస్ అయినట్లు ఉంది!'
అయితే ఇప్పుడు కన్నప్ప మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. మీడియాతో చిట్ చాట్ లో పలు వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే?
By: Tupaki Desk | 7 July 2025 10:15 AM ISTటాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు రూపొందినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కన్నప్ప మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. మీడియాతో చిట్ చాట్ లో పలు వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే?
"కన్నప్ప మూవీ చూశాను. చాలా బాగుంది. అద్భుతంగా తీశారు. కానీ సరిపడా రెవెన్యూ లేదు. పాన్ ఇండియాలో ఎక్కువ ఖర్చు పెట్టినా రావడం లేదు. పాత కన్నప్ప.. కొత్త కన్పప్పకు చాలా తేడా ఉంది. భారీగా మార్పులు చేశారు. విష్ణు బాగా నటించాడు. ప్రభాస్ సూపర్ గా యాక్ట్ చేశాడు. ప్రభాస్ ది చాలా మంచి క్యారెక్టర్" అని భరద్వాజ కొనియాడారు.
"అయితే ఆ సినిమాకు అంత డబ్బులు పెట్టడం అవసరమా? పిండి కొలది రొట్టె అన్నట్లు మన దగ్గర పిండికి సినిమా తీస్తే అంతే డబ్బులు వచ్చాయి. కానీ రూ.100-200 కోట్లు ఖర్చు పెడితే డబ్బులు రావడం లేదంటే కరెక్ట్ కాదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది" అని తెలిపారు.
"ఎప్పుడైనా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్పను దాటాలనుకోవడం తప్పులేదు. కానీ ఆ రకమైన కథ కావాలి. ఇప్పుడు కన్నప్ప భక్తిరస ప్రధానమైన చిత్రం. అలాంటి సినిమాలు లోకల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. మన దేశానికి సరిపడా సినిమాలు తీయాలి. అప్పట్లో రోటీ కపడా మఖాన్, జై సంతోషిమాత సినిమాలు రిలీజయ్యాయి"
"అప్పుడు రోటీ కపడా మఖాన్ కాస్ట్లీ ఫిల్మ్. జై సంతోషిమాత రూ.లక్షతో తీశారు. కానీ ఆ సినిమా రోటీ కపడాను డామినేట్ చేసింది. రూ.కోటి వసూలు చేసింది. అందుకే భక్తి రసానికి డబ్బులు ఖర్చు పెట్టలేదు. పాన్ ఇండియా మోజులో ఇప్పుడు కన్నప్పలో భక్తి మిస్ అయింది. భక్తి ఎప్పుడూ దెబ్బకొట్టదు. నిర్మాతను ఇబ్బంది పెట్టదు" అని తెలిపారు.
"పాన్ ఇండియా లెవెల్ లో కన్నప్ప బాగా తీశారు. కానీ ఏది అవసరమో అది మిస్ అయింది. భక్తి పండించి ఉంటే డబ్బులు తక్కువ అయ్యేవి.. ఎక్కువ వచ్చేవి.. కంటెంట్ కు తగ్గట్టు బడ్జెట్ పెట్టాలి. అయితే నేనేం తోపు కాదు. చాలా ఫ్లాప్ సినిమాలు చేశాను. కానీ కన్నప్ప విషయంలో నాకు అనిపించింది చెప్పాను" అని అన్నారు.
వంద శాతం భక్తితో తీసే భక్తి రస చిత్రాలు క్లిక్ అవ్వకుండా ఉండవని చెప్పారు. "సనాతన ధర్మంపై అందరి దృష్టి ఉంది. అందుకే భక్తి చిత్రాలు ఫ్లాప్ అవ్వవు. కనెక్ట్ అయితే వేరే లెవెల్. థియేటర్స్ లో పూనకాలు రావాలి. కన్నప్ప కన్ను తీసి కన్ను పెడితే పూనకాలు రావాలి. అలా తెప్పించే లెవెల్ లో తీయాలి" అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
